UIDAI : ప్రస్తుతం ఆధార్ కార్డ్ (Aadhaar Card) ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా ఉంటోంది. ప్రభుత్వ పథకాల (Government Schemes) ప్రయోజనాలను పొందడం నుంచి పిల్లల అడ్మిషన్ వరకు అన్నింటికీ ఆధార్ నంబర్ అడుగుతారు. ఆధార్ కార్డ్‌లో మన పేరు, చిరునామా, ఫోన్ నంబర్ నుండి వేలిముద్ర వరకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మన ఆధార్ ఎవరైనా తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే మనం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Aadhaar Misuse : ఎప్పుడైనా.. ఎవరైనా మన ఆధార్‌ను ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారని అనుమానం వస్తే కనుక.. మనం ఇంట్లోనే కూర్చొని ఆన్ లైన్ ద్వారా దాన్ని చెక్ చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక సైట్‌లో, మనం మన ఆధార్ నంబర్ ఎప్పుడు - ఎక్కడ ఎలా ఉపయోగించారో తెలుసుకునే అవకాశం ఉంది. దీని కోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.
మన ఆధార్ కార్డు ఎక్కడ ఉపయోగించామో తెలుసుకోవడం ఇలా..
- ముందుగా మీరు ఆధార్ వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఈ లింక్ uidai.gov.in ద్వారా ఆధార్ వెబ్సైట్ కు వెళ్ళవచ్చు.
- ఇక్కడ, ఆధార్ సేవల క్రింద, మీరు ఆధార్ ఆథరైజ్డ్ హిస్టరీ ఆప్షన్ చూడవచ్చు. దీనిపై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీరు ఆధార్ నంబర్ అలాగే కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసి, Send OTPపై క్లిక్ చేయాలి.
- దీని తర్వాత, ఆధార్‌తో లింక్ అయినా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై ధృవీకరణ కోసం OTP వస్తుంది, ఈ OTPని నమోదు చేసి,సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- దీని తర్వాత మీరు ప్రామాణీకరణ రకం, తేదీ పరిధి, OTPతో సహా అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని పూరించాలి. (గమనిక- ఇక్కడ మీరు 6 నెలల వరకు డేటాను చూడవచ్చు.)
- మీరు వెరిఫై OTPపై క్లిక్ చేసిన వెంటనే, మీ ముందు ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో గత 6 నెలల్లో ఆధార్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించారు అనే సమాచారం ఉంటుంది.
ఈ రిపోర్ట్ రికార్డులను పరిశీలించిన తర్వాత మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయినట్లు మీకు అనిపిస్తే, మీరు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. మీరు టోల్ ఫ్రీ నంబర్ 1947కి కాల్ చేయడం ద్వారా లేదా help@uidai.gov.in కు ఇమెయిల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా మీరు uidai.gov.in/file-complaint లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు .
ఎవరైనా మరణించిన వ్యక్తి ఆధార్ ఏం చేయాలి?
ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డును రద్దు చేసే నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో, మరణించిన వారి ఆధార్ కార్డును భద్రంగా ఉంచడం.. అది దుర్వినియోగం కాకుండా చూసుకోవడం మరణించిన వారి కుటుంబం బాధ్యత.
చనిపోయిన వ్యక్తి ఆధార్ ద్వారా ఏదైనా పథకం లేదా సబ్సిడీని పొందుతున్నట్లయితే, ఆ వ్యక్తి మరణించిన విషయాన్ని సంబంధిత విభాగానికి తెలియజేయాలి. దీంతో ఆ పథకం నుంచి ఆయన పేరు తొలగిస్తారు. ఇక మరణించిన వ్యక్తి ఆధార్ దుర్వినియోగం అవుతుందనే భయం ఉంటే ఆధార్ యాప్ లేదా UIDAI వెబ్‌సైట్ ద్వారా మరణించిన వ్యక్తి ఆధార్‌ను లాక్ చేయవచ్చు. మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.
Also Read : నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ