Sex hormones: దంపతులు శృంగారానికి దూరంగా ఉంటున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్లే! శృంగారానికి దూరంగా ఉంటున్న జంటలు అధికంగా శారీరక, మానసిక కృంగుబాటుకు గురవుతున్నట్లు నిపుణులు తెలిపారు. ప్రతి పది మందిలో ఒకరు ‘హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్’తో బాధపడుతున్నట్లు తాజా సర్వే ఆధారంగా వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 13 Jun 2024 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Benefits of sex: ఈ మధ్య కాలంలో ప్రతి పది మందిలో ఒకరు ‘హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్’తో బాధపడుతున్నట్లు తాజాగా ఓ అమెరికన్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జీవన శైలి కారణంగా చాలామంది దంపతుల్లో శృంగార కోరికలు పూర్తిగా తగ్గిపోతున్నాయని, దీంతో కలయికకు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అయితే రతికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, మానసికంగానూ ఇది కృంగుబాటుకు దారితీస్తున్నట్లు పేర్కొన్నారు. శాశ్వతంగా దూరమయ్యే అవకాశం.. ఈ మేరకు ‘లవ్ హార్మోన్’గా పిలిచే ఆక్సిటోసిన్ మనలో ప్రేమ భావనను పెంపొందించి భాగస్వామితో సాన్నిహిత్యంగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. అలాగే ‘సెక్స్ హార్మోన్’గా పిలిచే ఈస్ట్రోజెన్ వెజైనాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు లైంగిక కోరికల్ని పెంచుతుంది. అయితే శృంగారానికి దూరంగా ఉండే వారిలో ఈ రెండు హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కారణంగా భవిష్యత్తులో లైంగిక కోరికలు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఇవి తగ్గిపోతే మూడ్‌స్వింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయంటూ హెచ్చరిస్తున్నారు. ప్రవైట్ పార్ట్ ఇన్ఫెక్షన్లకూ దారితీసే ఛాన్స్.. అంతేకాదు శృంగారానికి దూరమవడం వల్ల వెజైనా, పెనీస్ ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. ప్రవైట్ పార్ట్ ఇన్ఫెక్షన్లకూ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ కలయికలో పాల్గొనకపోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదని, వెజైనా పొడిబారిపోయి కలయికలో పాల్గొన్నప్పుడు అసౌకర్యం కలుగుతుందన్నారు. రోజుల తరబడి కలయికకు దూరంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల వ్యాధుల్ని ఎదుర్కొనే సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఎక్కువ మొత్తంలో కొన్ని రకాల యాంటీ బాడీలు విడుదలైనట్లు మరో అధ్యయనం వెల్లడించింది. #couples #physical-and-mental-diseases #sex-hormones మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి