Stress: ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదించొచ్చు

ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం, ఎన్నో ఆలోచనలు మెదడులో వస్తుంటాయి. దీని వలన ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మనసులో ఆందోళన కలిగించే ఆలోచనలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

New Update
Stress: ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదించొచ్చు

Stress: ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం, ఎన్నో ఆలోచనలు మెదడులో వస్తుంటాయి. దీనివల్ల చాలా మంది ప్రజలు ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇది భవిష్యత్తులో చాలా హానికరం అని నిపుణులు అంటున్నారు. మనసులో ఆందోళన కలిగించే ఆలోచనలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ఎప్పుడూ ఆందోళన చెందే వారు కొన్న చిట్కాలను పాటించడం వల్ల బయటపడవచ్చని సూచిస్తున్నారు.
భవిష్యత్తు గురించి చింతించడం మానేయండి:
చాలా మంది భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. తర్వాత ఏం జరుగుతుందో, జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటారు. అయితే వర్తమానంలో జీవించడం ఎప్పుడూ మంచిది. కాబట్టి రేపు ఏం జరుగుతుందో అని చింతించవద్దు.
కుటుంబం-స్నేహితులతో గడపాలి:
ఒంటరిగా ఉన్న కొద్దీ మరింత ఆందోళన పెరుగుతుంది. రకరకాల ఆలోచనలు బాధపెడతాయి. అందుకే సన్నిహితులతో ఎక్కువ సమయం గడపాలి. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఆందోళన నుండి ఉపశమనం పొందవచ్చు.
ప్రశాంతంగా ఉండాలి:
ఆందోళన తగ్గించుకోవడానికి ముందుగా మిమ్మల్ని మీరు శాంతపరచుకోవడం నేర్చుకోండి. శాంతి వైపు తీసుకెళ్లే విషయాలపై దృష్టి పెట్టాలి.
మనసును మళ్లించండి:
ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతుంటే మనస్సును మరొక చోటికి మళ్లించండి. మీకు నచ్చిన పనుల్లో దీన్ని ఉపయోగించండి. వాస్తవానికి ఆలోచనలో మునిగి ఉన్న వ్యక్తి తరచుగా తన భావాలను కోల్పోతాడు. అందుకే మనస్సును ఇతర పనులపై పెడితే దీనిని నివారించవచ్చు.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి:
ఇప్పుడు జరిగే విషయంపై మైండ్‌ పెడితే వేరే ఆలోచనలు మనసులోకి రావు. ఇది ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
లోతైన శ్వాస తీసుకోండి:
ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతున్నప్పుడు వెంటనే నెమ్మదిగా, లోతైన శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అంతేకాకుండా ఏదైనా రాయడం, రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: గుమ్మడికాయతో గుండ్రటి ముఖం మీ సొంతం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు