Rose Flowers: ఇలా చేస్తే గులాబీ మొక్కలోని ప్రతీ కొమ్మకు పూలు పూస్తాయి..!! ఇంట్లో చాలా మంది మొక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. ప్రేమకు చిహ్నంమైన గులాబీ అంటే అందరికి ఇష్టమే. స్థలం, నీరు, మొక్కలకు పోషణ, అరటి తొక్క పేస్ట్, గుడ్డు షెల్, ఎప్సమ్ సాల్ట్ ఉంటే గులాబీ మొక్కకు ఎక్కువ పూలు పూస్తాయి. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 27 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Rose: గులాబీ పువ్వు ప్రేమకు చిహ్నం. తోటలో ఈ పువ్వు వికసిస్తే తోట మొత్తం ప్రకాశవంతంగా ఉంటుంది. దాని రంగు నుంచి దాని సువాసన వరకు.. ఇది ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో గులాబీ మొక్క పూయక పోవడం ఆందోళనగా ఉంటుంది. చాలా సార్లు కొందరూ దీనికి రసాయనాలు వేసిన.. దాని నుంచి పెద్దగా ప్రయోజనం ఉండదు. అటువంటి పరిస్థితిలో మంచి సమర్థవంతమైన పరిష్కారం ఉంది. గార్డెన్‌లోని గులాబీ మొక్క తక్కువ పూలను ఉత్పత్తి చేస్తున్నట్లయితే లేదా పూలు లేకుండా ఉంటే కొన్ని చిట్కాలు పాటిస్తే గులాబీ చెట్టు మొత్తం పూలు పూస్తాయి. ఇప్పుడు ఆ విషయాలు ఎంటో తెలుసుకుందాం. స్థలం గులాబీ మొక్కకు ఎక్కువ సూర్యకాంతి చాలా అవసరం. కుండను బహిరంగ ప్రదేశంలో పెట్టాలి. గులాబీలకు కనీసం 6 గంటల సూర్యరశ్మి పూర్తిగా గులాబీ కుండిపై పడేలా చూడాలి. నీరు కొత్త గులాబీ మొక్కలను నాటినట్లయితే..వాటికి ప్రతిరోజూ నీరు పెట్టాలి. అదే సమయంలో..మొక్క పెరిగినప్పుడు వారానికి ఒకసారి నీరు పెడితే మంచిది. కుండలో పారుదల రంధ్రాలు ఖచ్చితంగా ఉండాలి. కొమ్మ పూలతో నిండిపోతుంది గులాబీ మొక్కలు పువ్వులు ఉత్పత్తి చేయకపోతే..దీని కోసం ఆవపిండిని ఉపయోగించవచ్చు. ఇది మీకు మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. అన్నింటిలో మొదటిది.. దానిని 3-4 రోజులు నీటిలో నానబెట్టి, ఉబ్బుకోవాలి. తర్వాత 1:1 నిష్పత్తిలో నీళ్లలో కలిపి ప్రతి మూడోరోజు గులాబీ మొక్కల వేర్లపై పోయాలి. ఇలా 15 రోజులు చేయాలి. చెట్టు ఎదుగుదలకు, పూల ఉత్పత్తికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్కలకు పోషణ మొక్కకు సరైన పోషకాహారం అందించడానికి.. అరటి తొక్క పేస్ట్, గుడ్డు షెల్, ఎప్సమ్ సాల్ట్ కలపడం మంచి ఎంపిక. మొక్కలకు రసాయనిక ఎరువులు వాడడం వంటి చాలా దూరం చేయాలి. ఇలా చేస్తే గులాబీ పువ్వులు ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ఎన్నో వ్యాధులకు మామిడి చెక్ పెడుతుందని తెలుసా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #tips #rose-flowers #rose-plant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి