Health Tips : రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి..!!

మధుమేహం ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రిపూట కాఫీ తాగకూడదు. బదులు హెర్బల్ టీ తాగడం మంచిది. స్వీట్లు తినకండి.షుగర్ లెవల్స్ పెరుగుతాయి. వీటన్నింటికి బదులుగా రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేస్తే బాగా నిద్రపోవడంతోపాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు
New Update

Health Tips : మధుమేహం (diabetes) నేడు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇది ఒక్కసారి వచ్చిదంటే తగ్గదు. కంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన మందు. కాబట్టి అది ఎక్కువ లేదా తగ్గకుండా నియంత్రించడం మధుమేహం ఉన్న వ్యక్తి రోజువారీ డ్యూటీ. ఇష్టం వచ్చినట్లుగా తినడం, ఏది పడితే అది తినడం, ఆయిల్ ఫుడ్, స్వీట్స్, కొన్ని రకాల ఆహారా పదార్థాలు ఇవన్నీ కూడా డయాబెటిస్ కు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకు షుగర్ పేషంట్ల(Diabetic patients)కు వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారం వీటికి మించిన మందు మరొకటి లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే మనలో చాలా మంది డయాబెటిస్ పేషంట్లు రాత్రి నిద్రించే ముందు టీ తాగడం, స్వీట్లు తినడం లేదా అతిగా తినడం వంటివి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. ఎందుకంటే రాత్రి పూట శరీరానికి తగినంత వ్యాయామం లేనట్లయితే బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

రోజూ సాయంత్రం పూట ఈ చిట్కాలు పాటించే వారి బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడూ అదుపులో ఉంటాయి. కాబట్టి చిట్కాలు ఏంటో చూద్దాం.

మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయి ఎలా ఉండాలి?
కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరుగుతాయని మీకు తెలుసు. కాబట్టి సాయంత్రం లేదా రాత్రి భోజనం సమయంలో తక్కువ కార్బ్ ఫుడ్స్ తినండి. బదులుగా, తక్కువ స్వీట్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు లేదా ప్రోటీన్ అధికంగా ఉండే మంచి స్నాక్స్ తినడం అలవాటు చేసుకోండి.

వ్యాయామం చేయండి:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు వ్యాయామం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామానికి 30 నిమిషాలు కేటాయించండి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నడక, జాగింగ్, ట్రెడ్‌మిల్ వంటి ఏదైనా వ్యాయామాలు చేయవచ్చు.

సరైన సమయానికి నిద్రపోండి:
మీ మధుమేహాన్ని నియంత్రించడానికి ఇది కూడా ఒక ఉత్తమ చిట్కా. ప్రతిరోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మీ శరీరంలో మెటబాలిజం ప్రక్రియ చక్కగా సాగి, ఇన్సులిన్ స్థాయి మెరుగై మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. మీ సమతుల్య జీవనశైలిలో మంచి రాత్రి నిద్ర కూడా ఒక చిట్కా.

యోగా,ధ్యానం:
మీ మానసిక ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి పెరిగేకొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం.
అందులో మధుమేహం కూడా ఒకటని చెప్పొచ్చు. నియంత్రణ లేని చక్కెర స్థాయి కూడా ఉంది. కాబట్టి మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే మీ మనసుకు శాంతి అవసరం. కాబట్టి యోగాతోపాటు ధ్యానం చేయండి.

రాత్రిపూట కాఫీ తాగకూడదు:
నిద్రపోయే ముందు చాలా మందికి గ్లాసు పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రిపూట కాఫీ తాగకూడదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి దానికి బదులు హెర్బల్ టీ తాగడం మంచిది.

ఫోన్, ల్యాప్‌టాప్ వాడకండి:
ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఫోన్ లేదా ల్యాప్‌టాప్, ఇతర డిజిటల్ గాడ్జెట్‌లకు దూరంగా ఉండండి. ఇవి కళ్లపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రశాంతంగా నిద్రపోలేరు.

ఇది కూడా చదవండి: రెండు సార్లు సీఎం..అతి సాధారణ జీవితం..కర్పూరి ఠాకూర్ గురించి ఆసక్తికర విషయాలు..!!

#diabetes #diabetes-diet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe