Fish Smell : ఇంట్లో ఇలా చేస్తే చేపలు వండినప్పుడు వాసన రాదు.. ట్రై చేయండి

ఇంట్లో చేపలు కూర చేసిన్నప్పుడు చాలా వాసన వస్తుంది. ఆ వాసనను కాఫీ గింజలు, క్లీన్, దాల్చిన చెక్క, ఎయిర్ ఫ్రెషనర్స్, వెనిగర్, నీరుతో వంట చేసిన తరువాత ఉపయోగిస్తే వాసన పోతుంది.

Fish Smell : ఇంట్లో ఇలా చేస్తే చేపలు వండినప్పుడు వాసన రాదు.. ట్రై చేయండి
New Update

ప్రతీ ఇంట్లో మాంసం, చేపలు వండినప్పుడు ఎక్కువగా వాసన వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. చేపలు, మాంసం, చేప గుడ్లు వండేటప్పుడు ఇల్లుతో పాటు వంట పాత్రలు కూడా వాసన వస్తాయి. ఆ వాసన ఎంతకీ పోదు. ముఖ్యంలో చేపల కటింగ్ ఇంట్లోనే చేసిన.. కూరకు అవసరమైన వస్తువులతో వంట చేయడం వలన వాసన ఎక్కువగా వస్తుంది. అయితే.. ఇలా వాసన వస్తే వంట చేసే వారు ఆ వంటకాన్ని అస్సలు తింటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు ఆ వాసనతోనే కడుపులో వికారంగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఇందులో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ గింజలు: వెనిగర్, గ్రౌండ్ కాఫీని కౌంటర్ టాప్‌లో ఉంచితే వాసనలు పోతుంది. వీటిని ఇంట్లో వేయించినా ఆ వాసన సమస్య ఉండదు.
క్లీన్: చేపలను వండిన తర్వాత కిచెన్‌ని క్లీన్ చేస్తే వాసన తగ్గిపోతుంది. వంట చేసిన వెంటనే స్టౌ, కౌంటర్ టాప్స్ క్లీన్ చేస్తే వాసన రాకుండా ఉంటుంది.
దాల్చిన చెక్క: చేపల వాసనలని దూరం చేయడంలో దాల్చిన చెక్క బెస్ట్‌ . వెనిగర్ నీటిలో దాల్చిన చెక్క, ఎసెన్షియల్ ఆయిల్స్ వేస్తే వంటగది మంచి వాసన వస్తుంది.
ఎగ్జాస్ట్ ఫ్యాన్: ఇంట్లో నాన్‌వెజ్ వండినప్పడు వాసన, పొగ వస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడడం మంచిది. ఈ చిమ్నీని వాడితే వాసనతోపాటు పొగ రాదు.
ఎయిర్ ఫ్రెషనర్స్: ఈ టిప్స్‌ ఇబ్బందిగా ఉంటే ఎయిర్ ఫ్రెషనర్స్ వాడటం బెస్ట్. చేపలను వండిన వెంటనే కాసేపు ఫ్యాన్ ఆన్ చేసి ఫ్రెషనర్స్ వాడాలి. ఇలా చేస్తే ఫ్యాన్ నుంచి వచ్చే గాలితో ఇంట్లో ఉన్న చేపల వాసన పొతుంది.
వెనిగర్, నీరు: చేపలు ఫ్రై చేస్తున్నప్పుడు ఓ పాన్‌లో నీరు పోసి వేడి చేసి రెండు, మూడు చెంచాల వెనిగర్ కలిపితే గాలిలోనే వాసన పొతుంది.
కర్పూరం: కర్పూరం బిళ్లల్లో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో ఉంచితే వాసన పోతుంది.

ఇది కూడా చదవండి:  నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా..? తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి

#health-benefits #tips #fish-smell
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe