Sugar : రాత్రుళ్ళు ఈ లక్షణాలు ఉంటే షుగర్ లెవల్స్ తగ్గినట్లే.. నేటి కాలంలో షుగర్ సమస్య పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కావొచ్చు. షుగర్ ఉన్నవారికి రాత్రుళ్ళు షుగర్ లెవల్స్ తక్కువైతే హైపోగ్లైసీమియా అంటారు. అయితే రాత్రిపూట రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు ఏమేం లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి. By Durga Rao 23 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Diabetes Problem : నేటి కాలంలో షుగర్(Sugar) సమస్య పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కావొచ్చు. షుగర్ ఉన్నవారికి రాత్రుళ్ళు షుగర్ లెవల్స్ తక్కువైతే హైపోగ్లైసీమియా అంటారు.రక్తంలో చక్కెర స్థాయిలు నిర్ధిష్ట స్థాయి కంటే తక్కువైతే హైపోగ్లైసీమియా వస్తుంది. దీనిని లో బ్లడర్ షుగర్ లెవల్స్ అంటారు. టైప్ 1 డయాబెటిస్(Type 1 Diabetes) ఉన్నవారికి ఈ సమస్య ఉంటుంది. నిపుణుల ప్రకారం, రక్తంలో చక్కెర స్థాయిలు డెసిలీటర్‌కి 70 mg కంటే తక్కువగా ఉన్న షుగర్ పేషెంట్స్‌లో హైపోగ్లైసీమియా వస్తుంది. అలాంటప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి. రాత్రుళ్ళు షుగర్ లెవల్స్(Sugar Levels) తగ్గితే మరుసటి ఉదయం తలనొప్పిగా ఉంటుంది. అలసట, నీరసంగా ఉంటుంది. రాత్రిపూట షుగర్ లెవల్స్ తగ్గితే డీహైడ్రేషన్, హార్మోన్ల మార్పుల కారణంగా తలనొప్పి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గితే హార్ట్ బీట్ పెరుగుతుంది. మీ బాడీ గ్లూకోజ్ లెవల్స్ తగ్గుదలని చూపించినప్పుడు అది నిల్వ చేసిన చక్కెరని రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆడ్రినలిన్ కూడా రిలీజ్ అవుతుంది. ఆడ్రినలిన్ పెరుగుదల కారణంగా హార్ట్ బీట్ పెరుగుతుంది. అలాంటప్పుడు హార్ట్‌బీట్‌ని చూడాలి. రాత్రిపూట ఆకలి ఎక్కువగా ఉంటే ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడానికి ఓ లక్షణమని చెప్పొచ్చు. గ్లూకోజ్ లెవల్స్(Glucose Levels) తగ్గినప్పుడు మెదడుకి శక్తి అవసరమవుతుంది. ఇది రాత్రుళ్ళు ఆకలి పెరగడానికి కారణమవుతుంది.ఓ వ్యక్తికి రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే వారికి రాత్రుళ్ళు చెమటలు ఎక్కువగా పడతాయి. షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు శరీరమంతా చెమట పడుతుంది. ఈ ప్రతిచర్య ఆడ్రినలిన్, ఇతర హార్మోన్లని రిలీజ్ చేసి చెమటని కలిగిస్తుంది. ఈ సమయంలో మీ బాడీ రక్తంలో చక్కెర లెవల్స్‌ని పెంచుతుంది.బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గితే సరిగ్గా నిద్రపట్టదు. పట్టినా కలత నిద్రగా ఉంటుంది. దీని వల్ల నిద్ర సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. Also Read : రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్.. #diabetes #best-health-tips #type-1-diabetes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి