మలబద్ధకం అనేది చాలా అసౌకర్య పరిస్థితి. ఒక వ్యక్తికి మలబద్ధకం (Constipation in winter) ఉన్నప్పుడు అతని మానసిక స్థితి కూడా డిస్ట్రబ్ గా ఉంటుంది. మలబద్ధకం వల్ల ఏ పనులపైనా ఫోకస్ పెట్టలేకపోతుంటారు. చలికాలంలో మలబద్ధకం సమస్య తరచుగా పెరుగుతుంది. చలికాలంలో మలబద్ధకం సమస్య పెరగడానికి ప్రధాన కారణం జీవక్రియ మందగించడం (Slowing down metabolism). జీవక్రియ మందగించడం వల్ల, కడుపు కార్యకలాపాలు కూడా మందగించడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, అది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. అంటే మలబద్ధకం సమస్య జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి శీతాకాలంలో (winter) స్థిరమైన జీవక్రియ కారణంగా, కొంతమందికి మలబద్ధకం సమస్య దీర్ఘకాలికంగా మారుతుంది. మలబద్ధానికి దారితీసే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం.
తగినంత నీరు తాగకపోవడం :
చలికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. దీంతో వాతావరణం చల్లగా మారుతుంది. అందుకే ఈ సీజన్ లో చాలా మందిని నీరు అంతగా తాగరు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతారు. ఫలితంగా తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదు.మలం పేగుల్లో గట్టిపడి..పేగు కదలికల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులు మొత్తంగా మలబద్ధకానికి దారితీస్తాయి.
కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం:
చలికాలంలో చలిని తట్టుకునేందుకు చాలా మంది వేడి వేడి టీ, కాఫీలు తాగుతుంటారు. ఈ పానీయాల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అధికంగా కాఫీలు, టీలు తాగడం వల్ల శరీంలో కెఫిన్ పేరుకుపోతుంది. ఇది డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. క్రమంగా ప్రేగు కదలికల్లో అంతరాయం ఏర్పడి మలబద్ధకానికి కారణం అవుతుంది.
ఫైబర్ తక్కువగా తీసుకోవడం:
నేటికాలంలో యువత ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటుపడింది. వీటిలో ఫ్యాట్స్, చక్కెరలు అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. ఫైబర్ లోపించిన పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ మందగించి మలబద్ధకానికి కారణమవుతుంది.
వ్యాయామం లేకపోవడం:
చలికాలంలో ఉదయం తీవ్రమైన చలి, మంచు కారణంగా బయటకు వెళ్లలేని పరిస్ధితి. ఔట్ డోర్ వర్కౌట్స్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతాయి. ఫలితంగా శరీరానికి తగినంత శారీరక శ్రమ ఉండదు. దీంతో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఈ నిశ్చల జీవనశైలి మలబద్ధకాన్ని పెంచుతుంది.
ఎక్కువగా మందులు తీసుకోవడం:
వివిధ రోగాలకు ఔషధాలు వేసుకోవడం అనేది కామన్. అయితే చలికాలంలో కొన్ని ఔషధాలు మలబద్ధకానికి కారణం అవుతాయి. కోల్డో రెమెడీస్ , పెయిన్ రిలీవర్స్ వంటి మందుల వాడకం మధ్య బాగా పెరిగింది. వీటి ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతోంది. చలికాలంలో చల్లని వాతావరణం కారణంగా కొందరిలో బాత్రూమ్ వెళ్లాలనిపించదు. ఇది మలమద్ధకానికి దారి తీస్తుంది.
లక్షణాలు:
మలబద్ధకం ఉన్నవారిలో పెద్ద పేగు కదలికలు తగ్గడం, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మలంగట్టపడటం దానిపరిమాణం తక్కువగా ఉంటుంది. మలవిసర్జన చేయాలని అనిపించినా రాకపోవడం, పొట్ట ఉబ్బరం, నొప్పి, ఆహారం తినాలనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం లభించాలంటే ఎక్కువ ఫైబర్, పోషక విలువలు ఉన్న ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: అయోధ్య రాముడు ఎలా ఉంటాడంటే?…ప్రత్యేకతలివే..!!