Child Care Tips: పిల్లలు మొండిగా ఉంటే ఇలా చేయండి.. నార్మల్‌ ఐపోతారు!

సౌకర్యాలకు, విలాసాలకు ఎలాంటి తేడాలు ఉంటాయో పిల్లలకి చెప్పండి. దీని వల్ల పిల్లలు సరైన దారిలో నడుస్తారు. మీరు జాలిపడి చిన్న పిల్లలే కదా అని ప్రతిదానికి ఓకే చెప్పకూడదు. వాళ్లు అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే ప్రేమగా మాట్లాడి అసలు విషయాన్ని చెప్పాలి.

New Update
Child Care Tips: పిల్లలు మొండిగా ఉంటే ఇలా చేయండి.. నార్మల్‌ ఐపోతారు!

Child Care Tips:చిన్నపిల్లలు కొంతమంది వాళ్ళు అనుకున్నది జరగకపోతే చాలా గోల చేస్తారు. అంతేకాదు అది జరిగేంత వరకు అలుగుతారు కూడా. వాళ్లకు నచ్చిన పనులు కచ్చితంగా జరగాలనే ఆలోచనలోనే ఎక్కువగా ఉంటారు. అవి జరగకపోతే మంకు పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటారు. పెద్దలు చెప్పే మాటలకు ఒక్కొక్కసారి ఎదురు సమాధానం ఇస్తారు. అంతేకాదు కొన్నిసార్లు కోపం కూడా చేసుకుంటారు. చిన్నతనంలో వారి ప్రవర్తన మనకి నవ్వు తెప్పించినా.. పెద్దయిన తర్వాత ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ప్రతిదానికి కలుగుతున్నారా..? వాళ్లను నార్మల్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. అవి ఎలాగో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

1.పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి: తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇది చాలా ముఖ్యంగా పాటించాలి. మీరు క్రమశిక్షణతో పిల్లలకి ఎక్కువ పనిష్మెంట్ ఇస్తే వాళ్లలో మొండితనం ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదు మీరు ఏది చెప్పినా వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అందుకని తల్లిదండ్రులు పిల్లల పట్ల మంచి ప్రవర్తన, సమయపాలనపై అవగాహన కల్పించి, ప్రేమగా, మృదువుగా పిల్లలతో మాట్లాడితే వారు చక్కగా మాట వింటారు
2.మీరు లొంగొద్దు: పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్లు మీరు అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే.. మీరు జాలిపడి చిన్న పిల్లలే కదా అని ప్రతిదానికి ఓకే చెప్పకూడదు. మీరు మొహమాటం లేకుండా పిల్లలకు కష్టం విలువ, సర్దుబాట్లు అర్థమయ్యేలా చెప్పాలి. కోపం తగ్గించి వాళ్లకి మేలు జరిగే విషయాలు అయితే చెప్పడానికి అస్సలు మొహమాటం పడొద్దు.
3.కోపం తగ్గించండి: అంతేకాకుండా పిల్లలు కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా వాళ్లకు నేర్పిస్తే చాలా మంచిది. ఉద్రేకంలో ఇతరులను తిట్టడం, వస్తువులను పగలగొట్టడం, ఆహారం తినకపోవడం వంటి అలవాటు పడకుండా చూస్తే మంచిది.
4.ఆ విషయాలు చెప్పండి: సౌకర్యాలకు, విలాసాలకు ఎలాంటి తేడాలు ఉంటాయో పిల్లలకి చెప్పండి. వారికి ఏం కావాలో వారే ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. దానినిబట్టే వారికి నచ్చిన వస్తువు కోసం మంకు పట్టకుండా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో పిల్లలని చాలా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా వాళ్లతో సరదాగా మాట్లాడుతూ, మంచి విషయాలు చెబుతూ.. పిల్లలకి దగ్గర అయితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు.

Also Read: బార్లీ గింజలు చేసే మేలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Advertisment
తాజా కథనాలు