భారతదేశంలో పెసర పప్పును ఆహారంలో ఉపయోగిస్తారు. పెసర పప్పు (ముంగ్‌దాల్)లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్లు-ఏ,బీ,సీ,ఈతో పాటు అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఈ పప్పులో కాపర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. పెసర పప్పును ప్రొటీన్ల నిధి అని కూడా పిలిస్తారు. ఇది మన శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేయడంలో బెస్ట్ అని చెబుతున్నారు. అంతేకాదు ఇటిని నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వంటింట్లో ఉండే పెసరపప్పును పెద్దగా పట్టించుకోరు కానీ వీటిని రోజూ తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పెసరపప్పు తింటే వచ్చే లాభాలు:
- రక్తహీనత ఉన్నవారు మొలకెత్తిన పెసరపప్పు తింటే మంచిది. పెసరపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎర్ర రక్తకణాలను పెంచుతుంది. దీని వినియోగం రక్తహీనతతో పోరాడుతుంది.
- మొలకెత్తిన పెసలులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
- ఈ పప్సులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఇది చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా గ్రహించి.. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది. దీంతోపాటు బాదంపప్పును నానబెట్టి తింటే గ్లైసెమిక్ లోడ్ తగ్గుతుంది.
- ప్రస్తుతం చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే వ్యక్తులు ప్రతిరోజూ బాదంపప్పును తింటే మంచిది.
కప్పు మొలకెత్తిన ముంగ్‌దాల్‌లో 7 గ్రాముల ప్రొటీన్‌లు ఉంటాయి. ఇది కండరాలను నిర్మించడంలో ఎక్కువగా ఉపయోగపడుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. - పెసరపప్పు తేలికగా జీర్ణమయ్యే పప్పుధాన్యాలలో ఇది ఒకటి. అనారోగ్యం నుంచి కోలుకునే వారికి ఇది చక్కటి ఆహారం అని వైద్యులు అంటున్నారు.
- ముంగ్‌దాల్‌లో ఫెనిలాలనైన్, ఐసోలూసిన్, వాలైన్, లైసిన్, లూసిన్, అర్జినైన్‌తో సహా ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది. ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి చేస్తుంది.
- వంటింట్లో అన్ని పప్పులలో కంటే పెసరపప్పు ఎంతో శ్రేష్టమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పెసల్లనును రోజూ నానబెట్టిన తింటుంటే ఆరోగ్యానికి చాలామంచివి.
- పెసరపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
- బలహీనత, పోషకాహార లోపంతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు నానబెట్టిన పెసరపప్పును తింటే కండరాలకు వేగంగా శక్తి వస్తుంది.
- జ్వరం వచ్చినప్పుడు పెసరపప్పును తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. దీన్ని అనారోగ్యంతో ఉన్నవారికి సూప్ గానూ, పెసరకట్టుగానూ తింటే తొందరగా కోలుకుంటారు.
- పెసరపప్పు కేవలం ఆరోగ్యానికే కాదు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పెసరపప్పును పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే మొటిమలు, మచ్చలు తొలగిపోయి.
- పెసరపప్పు నానబెట్టిన నీటిని ముఖానికి అప్లై చేసుకుంటే వాడిపోయిన ముఖం తాజాగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: గోర్లు తెల్లగా కావాలంటే ఇలా ట్రై చేయండి