Nanubalu Leaves: ఈ ఆకు వాడితే పులిపిర్లు వెంటనే రాలిపోతాయి చాలామంది పులిపిర్లను తొలగించడానికి ఎన్నో రకాల ఆయింట్‌మెంట్లు రాసుకుంటూ ఉంటాం. మందులు కూడా వాడుతుంటాం. ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అందులో నానుబాలు అనే మొక్కను ఉపయోగించి పులిపిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. By Vijaya Nimma 03 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Nanubalu Leaves Health Benefits: చాలామంది పులిపిర్లతో బాధపడుతూ ఉంటారు. కొందరికి మెడపై, చేతివేళ్లపై, కనుబొమ్మల దగ్గర, చంక ప్రాంతాల్లో ఎక్కువగా పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్ల వల్ల మనకు ఎలాంటి హాని జరగకపోయినా చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాం. పులిపిర్లను తొలగించడానికి ఎన్నో రకాల ఆయింట్‌మెంట్లు రాసుకుంటూ ఉంటాం. మందులు కూడా వాడుతుంటాం. మరికొందరైతే వీటిని కట్ చేస్తుంటారు. అయినా పులిపిర్ల బారి నుంచి బయట పడలేకపోతుంటారు. ఎలాంటి మందులు వాడే అవసరం లేకుండా కేవలం ఆయుర్వేదం ద్వారా పులిపిర్లను తగ్గించుకోవచ్చు. పులిపిర్ల సమస్య నుంచి బయటపడవచ్చు ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. అందులో రెడ్డివారి నానుబాలు అనే మొక్కను ఉపయోగించి పులిపిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మొక్కను పచ్చబొట్లాకు, పాలకాడ, నాగార్జున అని కూడా అంటుంటారు. ఇది మనకు ఎక్కువ శాతం పొలాల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఈ రెడ్డి వారి నానుబాలు మొక్క చాలా సన్నగా కనిపిస్తుంది. ఈ మొక్క ఆకులను లేదా కాండాన్ని తుంచితే పాలు కూడా కారుతాయి. ఈ పాలు పులిపిర్లను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ మొక్క నుంచి వచ్చిన పాలను పులిపిర్లపై ఒక లేయర్‌గా రాయడం వల్ల వాటంతట అవే పులిపిర్లు రాలిపోతాయి. ఇలా ప్రతిరోజు చేస్తే పులిపిర్ల సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ధ్యానం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? ప్రతిరోజు ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలు అంతేకాకుండా కంటి చూపు కూడా మెరుగుపరిచే గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. ఈ పాలను కంట్లో రెండు చుక్కలు చొప్పున వేసుకుంటే కంటి పొరలు పోతాయి. మసకగా కనిపించడం తగ్గిపోతుంది. సంతానాన్ని పెంపొందించడంలో కూడా ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. మహిళల్లో గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించి సంతాన అభివృద్ధి కలిగిస్తుంది. నెలసరి వచ్చిన వారు మొదటి రోజుల్లో ఈ మొక్క దంచి రసాన్ని 9 మిరియాల పౌడర్ కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయి. గాయాలపై ఈ మొక్క నుంచి వచ్చిన పాలను రాయడం వల్ల తొందరగా మానుతాయి. మొటిమలను తగ్గించడంలో కూడా ఈ మొక్క ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయని వైద్యనిపుణులు అంటున్నారు. #health-benefits #nanubalu-leaves మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి