/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/License-Cancel.jpg)
License Cancel:దేశవ్యాప్తంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి అనేక నిబంధనలు మారబోతున్నాయి. ఇకపై అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి 2 వేల వరకు జరిమానా విధిస్తారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే రూ.25 వేల ఫైన్ వేస్తారు. అలాగే 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్‌కు అనర్హులుగా ప్రకటిస్తారు. వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ)నూ రద్దు చేస్తారు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మేరకు.. ఇకపై ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
ఆర్టీవో కేంద్రాలకు బదులుగా ప్రైవేటు శిక్షణా కేంద్రాలూ డ్రైవింగ్ టెస్టులను నిర్వహించి.. సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు. ఇక కాలుష్యాన్ని నియంత్రించేందుకు దాదాపు 9 లక్షల పాత ప్రభుత్వ వాహనాలను తొలగించి, కఠినమైన కార్ల ఉద్గార నియమాలను సర్కారు అమలు చేయనుంది. ఇటు ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు.. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో జూన్ 14 వరకు ఉచితంగా చేసుకోవచ్చు. చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి వారంలో వంట గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఈ మేరకు జూన్ 1వ తేదీనే గ్యాస్ సిలిండర్ కొత్త ధరలను ప్రకటించనున్నాయి.