Team India Coach: అది 2013.. ఏప్రిల్ 11.. వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం.. కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతోంది.. లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్‌లో కోహ్లీ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు.. వెంటనే కేకేఆర్ ప్లేయర్లు కోహ్లీ వికెట్‌ను సెలబ్రెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది సాధారణమే అయినా కోహ్లీ మాత్రం ఈజీగా తీసుకోలేకపోయాడు.పెవిలియన్ వైపు వెళ్లకుండా కోహ్లీ KKR ఆటగాళ్ల వైపుకు వెళ్లాడు. అంతకముందు గంభీర్ ఏదో అన్నట్టుగా చెబుతుంటారు.. దాదాపు కోహ్లీ-గంభీర్ కొట్టుకునే పని చేశారు. మధ్యలో రజత్ పటిదార్ ఇద్దరిని ఆపాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోలే క్రికెట్ గ్రౌండ్లో రెజ్లింగ్ జరిగేది.. 2023 లక్నోపై మ్యాచ్ సందర్భంగానూ ఈ ఇద్దరి మధ్య నానా రచ్చ జరిగింది..! సీన్ సీన్ కట్ చేస్తే.. గంభీర్ టీమిండియాకు కోచ్‌గా అవతరించనున్నడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇదే జరిగితే కోహ్లీ గంభీర్‌తో ఎలా నడుచుకుంటాడన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది!
Team India Coach: కొత్త కోచ్ గా గంభీర్! అదే జరిగితే.. కోహ్లీ ఏం చేస్తాడు?
టీమిండియా కొత్త కోచ్ కోసం వేట మొదలైంది. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్ గా రావచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ.. గంభీర్ మధ్య చాలాకాలంగా సత్సంబంధాలు లేవు. కోచ్ గా గంభీర్ వస్తే కోహ్లీ ఏం చేస్తాడు? అసలు వీరిద్దరి మధ్య గొడవేంటి? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే.
Translate this News: