Telangana Elections 2023: తీపి కబురు చెప్పిన సీఎం... రైతు బంధు రూ. 16000 ఇస్తామన్న కేసీఆర్..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురందించారు. రానున్న కాలంలో ఎకరానికి రూ. 16000వేలు ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

CM KCR: కాంగ్రెస్ కు గెలిచే సీన్ లేదు: గజ్వేల్ లో కేసీఆర్ ఆఖరి పంచ్
New Update

రైతులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. రానున్న రోజుల్లో రైతు బంధు రూ. 16000 ఇస్తామన్నారు. రైతు బంధు రూ. 16వేలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు. రైతు బంధు పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలోసీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ వెనకబడిన ప్రాంతమే అన్నారు. రైతు బంధు దండగనా? అంటూ జనాన్ని ప్రశ్నించారు. రైతు బంధు ఖచ్చితంగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో ఎకరానికి 16వేలు అవుతుందన్నారు. రైతులు అప్పులపాలు అవుతున్నారని రైతుబంధం ఇస్తున్నామన్నారు. ఇది రాజకీయం కాదన్నారు. తెలంగాణ జీవన్మరణ సమస్య అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకోసం ముందుకు రాలేదన్నారు. తెలంగాణలో మూడు గంటల కరెంటు సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. 24గంటలు కరెంట్ ప్రజలకు కావాలా వద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ 3గంటల కరెంట్ చాలంటున్నారని ఫైర్ అయ్యారు సీఎం.

తెలంగాణ వచ్చిన తర్వాత వడ్ల రాశులు ఎక్కడినుంచి వచ్చాయన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడిగేందుకు సిగ్గు లేదన్నారు. మన ముఖాలకు వాళ్లు మంచినీరు అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్ .

ఇది కూడా చదవండి:  ఆ రెండు పార్టీలు ఒక్కటే..వాళ్లకు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంకగాంధీ..!!

#telangana-elections-2023 #brs #cm-kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి