Jobs: డిగ్రీతో ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు..దరఖాస్తు గడువు ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే!

ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన శాఖల్లోని ఖాళీలను పూరించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 2100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా..చివరి తేదీ డిసెంబర్‌ 6.

Jobs: డిగ్రీతో ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు..దరఖాస్తు గడువు ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే!
New Update

ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన శాఖల్లోని ఖాళీలను పూరించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌ లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

దీని వల్ల సుమారు 2100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్‌ అయ్యింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు

మొత్తం ఖాళీలు : 2100
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ - 800
ఎగ్జిక్యూటివ్‌- సేల్స్ అండ్ ఆపరేషన్స్ - 1300
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ కి ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు.. ఎగ్జిక్యూటివ్‌ లకు నెలకు రూ.29,000- రూ.31,000 జీతం ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌ లైన్‌ టెస్ట్‌, పత్రాల వెరిఫికేషన్‌ ప్రీ రిక్రూట్‌ మెంట్‌ మెడికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: నవంబర్‌ 22, 2023, దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 06
పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు డిసెంబర్‌ 31,2023.. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిసెంబర్‌ 30, 2023 తేదీల్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/ లింక్ పై క్లి క్ చేసి అప్లయ్ చేసుకోవాలి.

Also read: కూర్చొని ఆఫీస్ పని చేయడం కన్నా.. పడుకొని చేయడం ఆరోగ్యానికి బెస్ట్ అంట.. ఎందుకంటే?

#jobs #notification #idbi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe