IND vs NZ: పాండ్యా స్థానంలో నంబర్ -1 బ్యాటర్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! రేపు(అక్టోబర్ 22) న్యూజిలాండ్‌పై జరగనున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో స్కైని ఎంపిక చేయాలన్న వాదన వినిపిస్తోంది. By Trinath 21 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి కివీస్‌తో మ్యాచ్‌కు భారత్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడం లేదన్న విషయం తెలిసిందే. పూణె వేదికగా బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. గాయం కారణంగా హార్దిక్ పూణెలో స్కాన్ చేయించుకున్నాడు. తర్వాత కోలుకోవడం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. రేపు(అక్టోబర్ 22) ధర్మశాలలో న్యూజిలాండ్‌తో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పాండ్యా అందుబాటులో ఉండకపోవడంతో అతని స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేస్తారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు జట్టులోకి తీసుకునేందుకు ముగ్గురు ఆటగాళ్లను పరిశీస్తోంది జట్టు మేనేజ్‌మెంట్. జట్టులోకి టాప్ ప్లేయర్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 ర్యాంక్‌లో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. 360 డిగ్రీ ప్లేయర్‌గా గ్రౌండ్‌కు ఏ వైపునకు అయినా షాట్ కొట్టగల సూర్య.. వన్డేల్లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేదు. వన్డేల్లో అతని గణాంకాలు చూస్తే ఎవరికైనా క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. 28 ఇన్నింగ్స్‌లలో 27 యావరేజ్‌తో కేవలం 667 రన్స్ చేశాడు స్కై. స్ట్రైక్ రేట్ 105 ఉన్నా.. యావరేజ్ మాత్రం తక్కువగా ఉంది. అటు హాఫ్ సెంచరీలు కూడా నాలుగే చేశాడు. అసలు సూర్యకుమార్ వరల్డ్‌కప్ టీమ్‌లోకి సెలక్ట్ కావడమే పెద్ద షాకింగ్. అయితే సూర్యను ఎంపికకు కొన్ని బలమైన కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. రేపటి(అక్టోబర్ 22) న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో సూర్యను తుది జట్టులోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే కివీస్ బౌలింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. వన్డేల్లో సూర్య చెత్త రికార్డులను పరిశీలించకుండా ఆడించాలంటున్నారు. మ్యాచ్ స్వరూపాని మార్చివేయడానికి సూర్యకు 30 బంతులు చాలని గుర్తు చేస్తున్నారు. స్వదేశి పిచ్‌లపై సూర్య ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌లు మరవద్దంటున్నారు. మరోవైపు ఇషాన్‌కిషాన్ లేదా అశ్విన్‌ని ఆడించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ తర్వాత అశ్విన్ మళ్లి ఆడలేదు. అయితే ధర్మశాల పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కి అనుకూలిస్తుందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే షమిని తీసుకునే అవకాశం కూడా ఉంది. Also Read: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..! #icc-world-cup-2023 #india-vs-newzealand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి