Fact Check: పాకిస్థాన్‌ క్రికెటర్లను పార్టీకి పిలిచిన కోహ్లీ.. సోషల్‌మీడియాలో రచ్చ..!

పాకిస్థాన్‌ క్రికెటర్లకు పార్టీ ఇస్తున్నానంటూ విరాట్‌ కోహ్లీ పేరిట ఓ ఫేక్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్ పబ్లిష్‌ అయ్యింది. ఇది కాస్త నిమిషాల్లో వైరల్‌గా మారింది. కొంతమంది తెలియక ఆ ట్వీట్‌ని షేర్ చేసేశారు. విరాట్‌ కోహ్లీ తీరును తప్పుపడుతూ సోషల్‌మీడియాలో మరికొందరు విమర్శలు గుప్పించగా.. ఆ ట్వీట్‌ని క్రాస్‌ చెక్‌ చేస్తే అది ఫేక్ అని తేలింది.

New Update
Fact Check: పాకిస్థాన్‌ క్రికెటర్లను పార్టీకి పిలిచిన కోహ్లీ.. సోషల్‌మీడియాలో రచ్చ..!

ఇటివలి కాలంలో ఇండియా-పాక్(India-Pak) క్రికెటర్ల స్నేహం గురించి సోషల్‌మీడియా రెండు వర్గాలుగా చీలిపోయి వాదించుకుంటోంది. పాక్ క్రికెటర్లతో టీమిండియా ఆటగాళ్లు అతిగా కలిసి స్నేహం చేస్తున్నారని కొంతమంది వాదిస్తుండగా.. మరికొంతమంది మాత్రం క్రికెటర్ల మధ్య ఫ్రెండ్‌షిప్‌ని తప్పుపట్టడానికి లేదని అంటున్నారు. ముఖ్యంగా కోహ్లీ చుట్టూనే ఈ గొడవ అంతా సాగుతోంది. కోహ్లీ(Virat Kohli)కి పాక్‌ క్రికెట్ టీమ్‌ నుంచి వచ్చే గౌరవం చాలా ఎక్కువ. కోహ్లీకి పాక్‌లోనూ అభిమానులు ఎక్కువే. పాక్‌ క్రికెటర్లు సైతం కోహ్లీ గురించి గొప్పగా చెప్పడానికి ఏ మాత్రం బ్యాక్‌ స్టెప్‌ వేయరు. కోహ్లీ ఆట అలాంటిది మరి. కోహ్లీ, పాక్‌ క్రికెటర్లు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో అభిమానులు పరస్పరం ఆర్గ్యూ చేసుకోవడం మాములే. ఇక ప్రపంచ కప్‌ ఆడేందుకు పాక్‌ జట్టు ఇండియాకు వచ్చింది. పాక్‌ టీమ్‌ని కోహ్లీని పార్టీకి పిలిచాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


కోహ్లీ ట్వీట్‌ చేశాడా?
ఇటివలి కాలంలో ఫేక్ ట్వీట్లు పెరిగిపోతున్నాయి. క్రికెటర్ల డీపీ పెట్టుకోని.. అకౌంట్‌ అడ్రెస్‌లో పదాలు కాస్త మార్చి రియల్‌ అకౌంట్‌ అని అనిపించేలా కొందరి ట్వీట్లు ఉంటున్నాయి. సెలబ్రెటీల పేరుతో ఎక్కువగా కనిపించే ఫేక్ అకౌంట్ల సంఖ్య పెరిగిపోయింది. ఫేక్ అకౌంట్ల నుంచి ట్వీట్లు వస్తుంటే అవి కాస్త వైరల్‌గా మారుతున్నాయి. న్యూస్‌ ఫీడ్స్‌లో ఆ వార్తలు కనిపిస్తుంటే అవి నిజమేననుకోని చాలా మంది రీట్వీట్లు చేస్తున్నారు. కొన్ని న్యూస్‌ వెబ్‌సైట్లు క్రాస్‌ చెక్ చేసుకోకుండా వాటిని వార్తలుగా పబ్లీష్‌ చేస్తున్నాయి. తాజాగా విరాట్‌ కోహ్లీ విషయంలోనూ అదే జరిగింది. నిజానికి పాకిస్థాన్‌ క్రికెటర్లను కోహ్లీ ఏ పార్టీకీ పిలవలేదు. అది ఫేక్ ట్వీట్.

'ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నా దేశానికి వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నేను సాదర స్వాగతం పలుకుతున్నాను, నా స్నేహితులకు ప్రత్యేకంగా షాదాబ్ కోసం నా ఇంట్ల పార్టీ ఇస్తాను, లవ్ యూ ఆల్, ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందాన్ని వ్యాప్తి చేస్తాను' అని విరాట్ చేసినట్టుగా ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

సదరు ఫేక్ అకౌంట్‌ డీపీ కూడా విరాట్‌ కోహ్లీ అఫిషీయల్‌ డీపీగానే పెట్టుకున్నాడు. దీంతో చాలా మంది క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా ఆ ట్వీట్‌ని షేర్ చేశారు. ఇది కాస్త నిమిషాల్లో వైరల్‌గా మారింది. తర్వాత క్రాస్‌ చెక్‌ చేస్తే అది అసలు విరాట్‌ అకౌంట్‌ కాదని తేలింది. ఇక ఇండియా, పాకిస్థాన్‌ మధ్య వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ నెల 14న ఆహ్మదాబాద్‌లో మ్యాచ్‌ జరగనుంది.

ALSO READ: కబడ్డీ ఫైనల్‌లో ధర్నా, డ్రామా.. గంటపాటు ఇండియా, ఇరాన్‌ ఆటగాళ్ల నిరసన!

Advertisment
తాజా కథనాలు