Shami Yogi: షమీకి యోగి గిఫ్ట్.. ఊర్లో క్రికెట్ స్టేడియం... సీఎం నిర్ణయంతో ఆ గ్రామంలో పండుగ! వరల్డ్‌కప్‌లో దుమ్మురేపుతున్న స్టార్ పేసర్ షమీకి యూపీ సీఎం యోగి అదిరిపోయే కానుక ఇవ్వనున్నారు. షమీ సొంతూరు సాహస్‌పూర్ అలీనగర్‌లో ఓ స్టేడియాన్ని నిర్మించనున్నారు . రూ.5 కోట్లతో నిర్మించనున్న స్టేడియంకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు షమీ తల్లిదండ్రులను సంప్రదించే అవకాశం ఉంది. By Trinath 18 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC WORLD CUP 2023: తాను పుట్టి పెరిగిన గ్రామం నుంచి మరింతమంది క్రికెటర్లు కావాలని టీమిండియా స్టార్ పేసర్ షమీ కలలుకన్నాడు. ఎప్పటికైనా తనకు తగిన గుర్తింపు లభిస్తుందని అనుకున్నాడు.. కెరీర్‌పరంగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చవిచూసిన షమీ ఫేట్ ఒక్క వరల్డ్‌కప్‌తో మారిపోయింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా షమీ పేరే మారుమాగుతోంది. షమీ..షమీ అంటూ క్రికెట్ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌కు వెళ్లడంతో కీలక పాత్ర పోషించిన షమీపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సీఎం, పీఎం వరకు అంతా షమీ బౌలింగ్‌కు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే షమీ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం షమీకి అదిరిపోయే గిఫ్ట్‌ను ఇవ్వాలని డిసైడ్ అయ్యింది Mohammed Shami has taken 194 wickets from just 99 innings in ODI.....🫡 - Crazy numbers in the Era where the batters have dominated. pic.twitter.com/52RcI1yE6W — Johns. (@CricCrazyJohns) November 16, 2023 ఊర్లో స్టేడియం: షమీ స్వగ్రామమైన అమ్రోహా జిల్లా అలీనగర్‌లో స్టేడియంను నిర్మించనుంది యూపీ ప్రభుత్వం. సీఎం యోగి ఆదిత్యనాథ్ సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడమే మిగిలి ఉంది. ఇప్పటికే ల్యాండ్‌ను గుర్తించారు అధికారులు. అమ్రోహా జిల్లా డిఎం రాజేష్ కుమార్ త్యాగి గ్రామంలో 1 హెక్టారు (2.47 ఎకరాల) భూమిని గుర్తించారు. స్టేడియం నిర్మించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 20 స్టేడియంలను నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలో ఇది భాగం. షమీ తల్లిదండ్రులే శంఖుస్థాపన చేస్తారా? అమ్రోహా జిల్లా అలీనగర్‌లో నిర్మించనున్న ఈ స్డేడియానికి షమీ తల్లిదండ్రులతోనే శంఖుస్థాపన చేయించాలని యోగి సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాహస్‌పూర్ అలీనగర్‌లో నిర్మించే స్టేడియంలో ఓపెన్ జిమ్, రేస్ ట్రాక్ వంటి సౌకర్యాలు ఉంటాయి. మొరాదాబాద్ నుంచి హాపూర్‌ను కలిపే NH-9 పక్కన ఈ స్టేడియం ఉండనుంది. దాదాపు రూ.5 కోట్లతో నిర్మించనున్న స్టేడియంకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు షమీ తల్లిదండ్రులను సంప్రదించే అవకాశం ఉంది. షమీ సహస్పూర్ అలీనగర్ గ్రామంలో పెరిగాడు . అతని తండ్రి తౌసిఫ్ అలీ ఓ రైతు. ఆయన కూడా ఫాస్ట్ బౌలర్. దీంతో చిన్నతనం నుంచే షమీకి కోచ్‌గా ఉన్నారు. తన సొంత డబ్బుతో షమీ కోసం తండ్రి పిచ్‌ని తయారు చేశారు. మొరాదాబాద్ క్లబ్‌లో షమీ తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే భారత్ ఫైనల్‌కు చేరగా.. రేపటి(నవంబర్ 19) ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటివరుకు ఈ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో షమీ 23 వికెట్లు పడగొట్టాడు. Also Read: షమీ, కోహ్లీ, రోహిత్, బుమ్రా.. వీరిలో ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ ఎవరికి ? WATCH: #yogi-adityanath #mohammed-shami #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి