Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!

ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్‌ జట్టును బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ గెలిపిస్తున్నాడు. ఫీల్డింగ్‌ ఇంపాక్ట్‌ లిస్ట్‌లో నంబర్‌-1 పొజిషన్‌లో ఉన్నాడు కోహ్లీ. 22.3 పాయింట్లతో కోహ్లీ ఫీల్డింగ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్లలో టాప్‌ లో ఉండగా.. తర్వాతి స్థానంలో జో రూట్‌ (నాలుగు క్యాచ్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (ఐదు క్యాచ్‌లు) ఉన్నారు. భారత్‌ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ 14 ఫీల్డర్ల ఖాతాలో 14 క్యాచ్‌లు, 10 రన్స్ సేవ్‌ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!
New Update

అంతర్జాతీయ క్రికెటైనా.. ఐపీఎల్‌ అయినా బ్యాటింగ్‌ పరంగా చూస్తే కోహ్లీకి ఉన్న రికార్డులు మరెవరికి లేవు. క్రికెట్ గాడ్ సచిన్‌ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసిన కింగ్‌ కోహ్లీ(Virat Kohli).. మరికొన్ని రికార్డులు బ్రేక్ చేసేందుకు ఎక్కువ కాలం పట్టేలా కనిపించడంలేదు. రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. కొత్త రికార్డులు సృష్టించడంలోనూ కోహ్లీ అందరికంటే ముందుంటాడు. అయితే కోహ్లీ కేవలం బ్యాటర్‌గానే కాదు ఫీల్డర్‌గానూ టీమిండియా గెలుపునకు కారణం అవుతున్నాడు. దానికి సంబంధించిన లెక్కలపై ఓ లుక్కేయండి.

ఫీల్డింగ్ ఇంపాక్ట్:
ప్రస్తుత ప్రపంచ కప్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా కోహ్లీ ఫీల్డింగ్‌లో తన సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లోనూ ఫీల్డింగ్‌ పరంగా కోహ్లీ అందరికంటే ముందున్నాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ మొత్తం మూడు క్యాచ్‌లను పూర్తి చేశాడు. వికెట్ కీపర్లకే కోహ్లీ పోటీగా నిలుస్తున్నాడంటూ ఫ్యాన్స్‌ పొగుడుతున్నారు. ఇక ఫీల్డింగ్ ఇంపాక్ట్‌ లిస్ట్‌ని గమనిస్తే కోహ్లీ వల్ల ఇండియా ఎలా గెలుస్తుందో అర్థమవుతుంది.

వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కోహ్లీ సేవ్ చేసిన పరుగులు, ప్రెజర్‌ రేటింగ్‌ జాబితాలో టాప్‌ ఉన్నాడు. మొత్తం 22.3 పాయింట్లతో కోహ్లీ ఫీల్డింగ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (నాలుగు క్యాచ్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (ఐదు క్యాచ్‌లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న స్టార్‌ ప్లేయర్లు. ఈ ఇద్దరూ కోహ్లీకి గట్టి పోటి ఇస్తున్నారు. వార్నర్‌, రూట్‌ కంటే కోహ్లీ తక్కువ క్యాచ్‌లే పట్టినప్పటికీ రన్స్ సేవ్ చేయడంలో వారి కంటే ముందున్నాడు. భారత్‌ నుంచి కోహ్లీ కాకుండా ఇషాన్ కిషన్ టాప్‌-10లో ఉన్నాడు. ఇషాన్‌ 13 పాయింట్లు సాధించాడు. పాకిస్థాన్ తరఫున షాదాబ్ ఖాన్ టాప్-10 జాబితాలో ఉన్నాడు. 15.13 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ 14 ఫీల్డర్ల ఖాతాలో 14 క్యాచ్‌లు, 10 రన్స్ సేవ్‌ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

ALSO READ: ఆ సింహం రికార్డు బద్దలు కొట్టేందుకు బరిలోకి దూకుతున్న పులి.. ఇక బంగ్లాకు బ్యాండ్‌ బాజే..!

#virat-kohli #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe