స్పీడ్ కిల్స్ ..! రోడ్డుపై కొందరు రయ్ రయ్ అని దూసుకుపోతారు. ఓవర్ స్పీడ్‌తో రోడ్డుపై ఇతర వాహనదారులను ఇబ్బంది పెడతారు. ఇలాంటి వారి వల్ల నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కొన్నిసార్లు స్పీడ్‌గా వెళ్లిన వారే యాక్సిడెంట్‌లో మరణిస్తుంటారు. ఓవర్ స్పీడ్‌తో డ్రైవ్ చేయడం వల్ల ఏదోక అనర్థం జరగకమానదు. అందుకే స్లో అండ్ స్టడి విన్స్ ది రేస్ అని చెబుతుంటారు. అయితే కొంతమందికి ఇవేవి చెవికి ఎక్కవు. వేగంగా వెళ్లిన వారి ప్రాణాలు పోతున్నా.. ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నా.. ఈ ఓవర్‌స్పీడ్ మైండ్‌సెట్ వాహనదారులు మారరు. ఇలాంటివారిపై పోలీస్‌శాఖ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. అటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తుంటారు. మరోసారి అదే చేశారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ రనౌట్‌ని ఓవర్ స్పీడ్‌తో కంపేర్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అద కాస్త వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌పై మ్యాచ్ ద్వారా వన్డే ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్ ఆడాడు సూర్యాభాయ్. వేగంగా ఆడడంలో సూర్యకు మంచి పేరు ఉంది. అయితే సూర్యను బ్యాడ్‌లక్ వెంటాడింది. క్రీజులోకి అలా వచ్చి రావడంతోనే సూర్యకుమార్ రనౌట్ అయ్యాడు. పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో వేగంగా ముందుకు కదిలాడు.. అయితే అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లీ చివరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో సూర్య రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
అతి వేగం వద్దు:
'రోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.' అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లలో కొందరు మాత్రం అసలు పోస్ట్ క్యాప్షన్‌కి, నిన్న జరిగిన రనౌట్‌కి సీన్ సింక్ కాలేదని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ రనౌట్ సమన్వయ లోపం వల్ల జరిగింది. కోహ్లీ అలా చేసి ఉండాల్సింది కాదు అని.. సూర్యకుమార్ అతి వేగంగా ఏమీ లేడని.. అతను కరెక్ట్‌గానే ఉన్నాడని చెబుతున్నారు.
Also Read: టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ మృతి..!