World Cup 2023: గుజరాత్‌ ఫ్యాన్స్‌పై పాక్‌ వార్‌.. ఐసీసీకి ఇచ్చిన కంప్లైంట్‌లో ఏం ఉందంటే?

పాకిస్థాన్ జర్నలిస్టులకు వీసాల జాప్యంపై ఆ దేశ బోర్డు మండిప‌డుతోంది. ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఐసిసికి మరోసారి కంప్లైంట్ ఇచ్చింది. ఇక అక్టోబరు 14న జరిగిన ఇండియా వర్సెస్ పాక్‌ మ్యాచ్ సందర్భంగా టీమ్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ లక్ష్యంగా క్రౌడ్ చేసిన అనుచిత ప్రవర్తనను సీరియ‌స్‌గా తీసుకున్న‌ పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

New Update
World Cup 2023: గుజరాత్‌ ఫ్యాన్స్‌పై పాక్‌ వార్‌.. ఐసీసీకి ఇచ్చిన కంప్లైంట్‌లో ఏం ఉందంటే?

అసలు పాకిస్థాన్‌కు ఇండియాలో మ్యాచ్‌లు ఆడడమే ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. సో మేము కూడా ఇండియాకు వచ్చేదే లేదు అని పాక్‌ బోర్డు చాలా సార్లు తెగేసి చెప్పింది. అయినా చివరిలో చేసేదేం లేక ఇండియా ఫ్లైట్ ఎక్కింది. హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యింది. వరల్డ్‌కప్‌లో పాక్‌ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది.. అందులో రెండు గెలిచింది. అయినే కొన్ని విషయాల్లో ఇండియా పట్ల పాక్‌ అసహనంతో ఉంది. ఇండియాలో మ్యాచ్‌లను కవర్ చేసేందుకు పాకిస్తాన్‌ జర్నలిస్టులకు ఇప్పటివరకు లైన్ క్లియర్‌ కాలేదు. దీనిపట్ల పాకిస్థాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. పాక్‌ జర్నలిస్టులకు వీసాల జాప్యం, ప్రపంచ కప్ కోసం తమ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి మరోసారి కంప్లైంట్ చేసింది. దీంతో పాటుగా అహ్మదాబాద్‌ అభిమానులపైనే ఫిర్యాదు చేసింది.


ఆ రోజు ఏం జరిగింది?
ఇండియా, పాకిస్థాన్‌ మధ్య అక్టోబర్‌ 14న గుజరాత్ అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మాట్లాడుతుండగా.. అహ్మదాబాద్‌ క్రౌడ్‌ 'బూస్' సౌండ్ చేశారు. ప్రస్తుతం ఇండియానే ప్రపంచకప్‌ను హోస్ట్ చేస్తుండగా.. పాకిస్థాన్‌ని గెస్ట్ అని.. అతిథుల‌ను ఇలా అవమానిస్తారా అని ఇండియా నుంచే ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. బాబ‌ర్ అజామ్‌తో పాటు రిజ్వాన్‌కు కూడా చేదు అనుభ‌వం ఎదురైంది. రిజ్వాన్ అవుటైన స‌మ‌యంలో అహ్మ‌దాబాద్ క్రౌడ్ జై శ్రీరామ్ నినాదాలు చేసింది. రిజ్వాన్ న‌మాజ్ చేశాడ‌ని.. అందుకే ఇలా నినాదాలు చేశార‌ని భార‌త్ అభిమానులు కొంద‌రు దీన్ని స‌మ‌ర్థించుకుంటున్నా అంత‌ర్జాతీయ స‌మాజం మాత్రం ఇండియా వెర్ష‌న్‌లో ఆలోచించ‌దు క‌దా..

బాబ‌ర్ అజామ్ ప‌ట్ల 'బూస్ సౌండ్లు చేయ‌డం ప‌ట్ల పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. ఇదే విష‌యాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింద. ఏకంగా అధికారిక ఫిర్యాదు చేసింది. ఇక స్టేడియంలో జై శ్రీమ్ నినాదాల ప‌ట్ల ఇప్ప‌టికే త‌మిళ‌నాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి నిప్పులు చెరిగారు. భారత్‌ క్రీడాస్ఫూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్‌ ఆటగాళ్ల పట్ల అక్కడి ప్రేక్షకుల తీరు ఆమోదయోగ్యం కాదు. ఇది చాలా కొత్తగా అనిపించింది. దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడానికి క్రీడాలున్నాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఆటను ఒక సాధనంగా ఉపయోగించడం ఖండించదగినది.' అని ట్వీట్ చేశారు.

ALSO READ: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌.. అసలేం జరుగుతోంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు