నోటికి వచ్చింది అనేస్తూ.. చేతికి వచ్చింది టైప్ చేసేస్తే ప్రజలు కాసేపు ట్రోల్ కంటెంట్ అనుకోని నవ్వుకుంటారేమో కానీ.. భవిష్యత్‌లో ఆ నోటికి మూతపడితే వచ్చే బాధ అంతాఇంతాకాదు.. ట్రోల్ చేసిన వాళ్లే సైలెంట్‌గా సైడ్ ఐపోతారు. ఈ వరల్డ్‌కప్‌కు ముందు కేఎల్ రాహుల్(KL Rahul)ని ట్రోలర్స్, మీమర్స్ చాలా మాటలన్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం రాహుల్‌ని మీమ్ మెటీరియల్‌గా వాడుకున్నారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా.. ఇప్పుడు రాహుల్ టైమ్ నడుస్తోంది. ఏ బౌలర్ వస్తాడో రండ్రా అంటున్నాడు. వరల్డ్‌కప్‌లో టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందిస్తున్నాడు.
మొత్తం మార్చేశాడు:
రెండు నెలల క్రితం వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. లిస్ట్‌లో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. రాహుల్ అప్పుడే గాయం నుంచి కోలుకోని ఉన్నాడు. అది కూడా పూర్తిగా కోలుకోలేదు. అయినా కూడా సెలక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ రాహుల్‌పై నమ్మకం ఉంచాడు. అటు ఫ్యాన్స్ మాత్రం రాహుల్ సెలక్షన్‌ని తప్పుపట్టారు. మీడియాలో కూడా అనేక కథనాలు రాహుల్‌కి సెలక్షన్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. అటు సోషల్‌మీడియాలో ఎలాగో ట్రోలింగ్ ఉంటుంది. అయితే వీరి అంచనాలు తలకిందులు చేయడానికి రాహుల్‌కి ఎక్కువ కాలం పట్టలేదు. ప్రస్తుతం టీమిండియాకు తురుపుముక్క ప్లేయర్ ఎవరో కాదు.. రాహులే..!
ఆస్ట్రేలియాతో మొదలు:
వరల్డ్‌కప్‌లో ఇండియా తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడింది. ఆస్ట్రేలియాను 200లోపే కట్టడి చేసింది. 200పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. గిల్, రోహిత్, అయ్యర్ డకౌట్ అయ్యారు. కోహ్లీ మీదే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కేఎల్ రాహుల్‌పై పెద్దగా ఎవరికి హోప్స్ లేవు.. కానీ రాహుల్‌కి తనపై తనకు కాన్ఫిడెన్స్ ఉంది. కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడాడు. ఇద్దరూ కలిసి టీమిండియాను గెలిపించారు. ఆ తర్వాత మ్యాచ్‌ల్లోనూ రాహుల్ తన సత్తా చూపించాడు. ఇక నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో రికార్డు సెంచరీ చేశాడు. 62 బంతుల్లోనే సెంచరీ చేసిన రాహుల్ టీమిండియా నుంచి వరల్డ్‌కప్‌లో వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇలా విమర్శల నోటికి తాళాలు వేశాడు.
Also Read: సెహ్వాగ్‌కు అత్యున్నత గౌరవం.. డాషింగ్ ఓపెనర్‌కు ఐసీసీ సలామ్!
WATCH: