హిందూ ధర్మంపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ని మట్టికరిపించింది. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవ్వగా.. వాటిలో ఓ వీడియోసై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్(Rizwan)ను టార్గెట్ చేసేలా స్టేడియంలోని అభిమానులు చేసిన నినాదాలపై ఉదయనిధి స్టాలిన్(Udayanidhi stalin) విమర్శించారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు క్రీడా మంత్రిగా ఉన్నారు.
స్టేడియంలో 'జై శ్రీ రామ్' నినాదాలు:
వరల్డ్‌కప్‌లో భాగంగా రిజ్వాన్ తొలి మ్యా్‌చ్‌లో గ్రౌండ్‌లోనే నమాజ్ చేశాడు. ఇది కాస్త విమర్శలకు దారి తీసింది. మత ప్రచారానికి రిజ్వాన్ వచ్చాడంటూ ఆటడానికి కాదంటూ పలువురు మండిపడ్డారు. కావాలనే రిజ్వాన్ భారత్ ప్రేక్షకులను రెచ్చగొట్టేందుకు ఇలా చేశాడని ఫైర్ అయ్యారు. అయితే రిజ్వాన్ గతంలోనూ వేరే దేశం గడ్డలపై కూడా ఇలా చేసినట్టు పాక్ అభిమానులు చెబుతున్నారు. ఎవర్ని రెచ్చగొట్టడానికి రిజ్వాన్ ఇలా చేయలేదని.. అతను ఎప్పుడూ అంతేనని వాదించారు. ఇదంతా నిన్నటి మ్యాచ్ ముందు వరకు జరిగిన తతంగం. నిన్న మ్యాచ్ సమయంలో రిజ్వాన్ లక్ష్యంగా స్టేడింయంలోనిక కొందరు అభిమానులు 'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు చేశారు.
ఇండియా అంటే ఇది కాదు:
69 బంతుల్లో 49 పరుగులు చేసిన తర్వాత రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వస్తున్నప్పుడు ప్రేక్షకులు 'జై శ్రీ రామ్' అని నినాదాలు చేయడాన్ని ఉదయనిధి స్టాలిన్ తప్పుపట్టారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇలా పోస్ట్ చేశాడు.. 'భారత్ క్రీడాస్ఫూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్ ఆటగాళ్ల పట్ల అక్కడి ప్రేక్షకుల తీరు ఆమోదయోగ్యం కాదు. ఇది చాలా కొత్తగా అనిపించింది. దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడానికి క్రీడాలున్నాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఆటను ఒక సాధనంగా ఉపయోగించడం ఖండించదగినది.' అని ట్వీట్ చేశారు ఉదయనిధి స్టాలిన్. అటు చెన్నై వేదికగా వరల్డ్‌కప్‌లో పాక్ రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
ALSO READ: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్ వీడియో..!