/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-1-jpg.webp)
పాకిస్థాన్ బ్యాటర్ల భరతం పట్టారు టీమిండియా బౌలర్లు. పాక్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలపడనివ్వకుండా చేశారు. భారత్ బౌలర్ల విజృంభణతో 42.5 ఓవర్లలో పాక్ 191 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ తలో రెండు వికెట్లు తీశారు.
Arijit Singh enjoyed that wicket😂#INDvsPAKpic.twitter.com/GfC1q8aTZp
— Umpire (@XTweetsCricket) October 14, 2023
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఆదిలో నిలకడగా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది పాక్. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బౌండరీలతో జోరు పెంచింది. వికెట్ తీసేందుకు టీమిండియా బౌలర్లు చాలా కష్టపడ్డారు. ఓపెనర్లు అబ్దుల్లా, ఇమామ్ భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే టీమిండియాకు హైదరాబాదీ స్పీడ్ స్టర్ సిరాజ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. 24 బంతుల్లో 20 రన్స్ చేసిన అబ్దుల్లాను LBW చేశాడు. ఇక ఆ తర్వాత 6 బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన ఇమామ్ ఉల్ హక్‌ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. 38 బంతుల్లో 36 రన్స్ చేసిన ఇమామ్ కీపర్ రాహుల్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు.
The powerful picture of the day!
What a bowler Siraj is. #INDvsPAKpic.twitter.com/RRgEtdThuz
— Daily Detect (@DailyDetect) October 14, 2023
రాణించిన బాబర్, రిజ్వాన్:
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిజ్వాన్‌తో కలిసి బాబర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. ఈ ఇద్దరి జోడిని విడతీసేందుకు టీమిండియా బౌలర్లు చాలా కష్టపడ్డారు. ఇదే క్రమంలో బాబర్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలపడలేదు. 58 బంతుల్లో 50 రన్స్ చేసిన బాబర్‌ని సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌కి వచ్చాడు. హాఫ్ సెంచరీవైపు సాగుతున్న రిజ్వాన్‌ని బుమ్రా అవుట్ చేశాడు. 69 బాల్స్‌లో 49 రన్స్ చేసిన రిజ్బాన్ బుమ్రా బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత టీమిండియా మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసింది. పాక్ తడపడింది. ఎప్పటిలాగే సైకిల్ స్టాండ్‌ని తలపించేలా వరుసపెట్టి వికెట్లు కోల్పోయింది. షకీల్, ఇఫ్తికర్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కి పంపించాడు. ఆ తర్వాత షాదబ్‌ఖాన్‌ను బుమ్రా అవుట్ చేశాడు. షకీల్, ఇఫ్తికార్, షాదబ్ ఖాన్ ముగ్గురూ కూడా సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. దీంతో ఒక దశలో 300 రన్స్ చేస్తుందనుకున్న పాక్ ఘోరంగా 191 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది.
ALSO READ: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!
Follow Us