భారత్ యువ సంచలనం శుభమన్ గిల్ వన్డేల్లో దూసుకుపోతున్నాడు. అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాది విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 26 పరుగుల చేసిన గిల్ వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఏడో ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్‌ను బౌండరీకి కొట్టడంతో అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో హాషీమ్ అమ్లా రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 40 ఇన్నింగ్స్‌లలో అమ్లా 2 వేల పరుగుల మార్క్‌ను చేరుకోగా.. గిల్ 38 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను దాటాడు.
ప్రపంచంలోనే టాప్:
గిల్ కేవలం 38 ఇన్నింగ్స్ ఆడి ఈ ఫీట్ సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ యువ ఆటగాడు ముందుముందు మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడంటున్నారు క్రికెట్ పండితులు. ప్రస్తుతం గిల్ యాజ్ 24 మాత్రమే. ఇక ప్రస్తుతం గిల్ యావరేజ్ 64గా ఉంది. 38 ఇన్నింగ్స్‌లో గిల్ 7 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఒక డబుల్ హండ్రెడ్ కూడా ఉంది. అటు అమ్లా వన్డేల్లో 2 వేల రన్స్ చేయడానికి 40 ఇన్నింగ్స్ ఆడాడు. అమ్లా తర్వాతి స్థానంలో జహీర్ అబ్బాస్, కెవీన్ పీటర్‌సన్, బాబర్, అజామ్ అంతా కూడా 45 ఇన్నింగ్స్‌లలో 2 వేల రన్స్ మార్క్‌ను చేరుకున్నారు.
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా?
గిల్ ఈ ఏడాది అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వన్డేల్లో 1,000కు పైగా రన్స్ చేశాడు. ప్రస్తుతం గిల్ 1300కు పైగా రన్స్ చేసి ఉన్నాడు. ఈ ఏడాది అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. గిల్ కాకుండా ఇంకా ఏ ప్లేయర్ కూడా కనీసం 1,000 రన్స్ మార్క్‌ను టచ్ కాలేదు. వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ రన్స్ చేసిన రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ పేరిట ఉంది. 1998 క్యాలెండర్ ఇయర్‌లో సచిన్ 1,894 రన్స్ చేశాడు. గిల్ ఈ ఏడాది ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. గాయాలు అవ్వకుండా ఉంటే గిల్ సచిన్ రికార్డును కూడా బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.
Also Read: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. !