IND Vs NZ: సచిన్, కోహ్లీ, రోహిత్ వల్ల కూడా కాలేదు! గిల్ ఏం సాధించాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు! వన్డేల్లో మరో రికార్డు బద్దలు కొట్టాడు టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్. తక్కువ ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై 26 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి పడింది. గిల్ 38 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ నమోదు చేయగా.. దక్షిణాప్రికా క్రికెట్ దిగ్గజం అమ్లా 40 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మార్క్‌ని టచ్ అయ్యాడు. By Trinath 22 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత్ యువ సంచలనం శుభమన్ గిల్ వన్డేల్లో దూసుకుపోతున్నాడు. అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాది విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 26 పరుగుల చేసిన గిల్ వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఏడో ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్‌ను బౌండరీకి కొట్టడంతో అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో హాషీమ్ అమ్లా రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 40 ఇన్నింగ్స్‌లలో అమ్లా 2 వేల పరుగుల మార్క్‌ను చేరుకోగా.. గిల్ 38 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను దాటాడు. Shubman Gill - the Prince.#INDvsNZ pic.twitter.com/sT48jgqyTu — VINEETH𓃵🦖 (@sololoveee) October 22, 2023 ప్రపంచంలోనే టాప్: గిల్ కేవలం 38 ఇన్నింగ్స్ ఆడి ఈ ఫీట్ సాధించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ యువ ఆటగాడు ముందుముందు మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడంటున్నారు క్రికెట్ పండితులు. ప్రస్తుతం గిల్ యాజ్ 24 మాత్రమే. ఇక ప్రస్తుతం గిల్ యావరేజ్ 64గా ఉంది. 38 ఇన్నింగ్స్‌లో గిల్ 7 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఒక డబుల్ హండ్రెడ్ కూడా ఉంది. అటు అమ్లా వన్డేల్లో 2 వేల రన్స్ చేయడానికి 40 ఇన్నింగ్స్ ఆడాడు. అమ్లా తర్వాతి స్థానంలో జహీర్ అబ్బాస్, కెవీన్ పీటర్‌సన్, బాబర్, అజామ్ అంతా కూడా 45 ఇన్నింగ్స్‌లలో 2 వేల రన్స్ మార్క్‌ను చేరుకున్నారు. సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా? గిల్ ఈ ఏడాది అద్బుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వన్డేల్లో 1,000కు పైగా రన్స్ చేశాడు. ప్రస్తుతం గిల్ 1300కు పైగా రన్స్ చేసి ఉన్నాడు. ఈ ఏడాది అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. గిల్ కాకుండా ఇంకా ఏ ప్లేయర్ కూడా కనీసం 1,000 రన్స్ మార్క్‌ను టచ్ కాలేదు. వన్డేల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ రన్స్ చేసిన రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ పేరిట ఉంది. 1998 క్యాలెండర్ ఇయర్‌లో సచిన్ 1,894 రన్స్ చేశాడు. గిల్ ఈ ఏడాది ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. గాయాలు అవ్వకుండా ఉంటే గిల్ సచిన్ రికార్డును కూడా బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. Also Read: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. ! #shubman-gill #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి