IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షమి ఐదు వికెట్లతో రాణించాడు.

IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
New Update

భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అటు భారత్ బౌలర్లలో షమీ అదరగొట్టాడు. ఏకంగా 5 వికెట్లతో కవీస్‌ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమికి ఇది తొలి మ్యాచ్‌ కావడం విశేషం.


టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌ నుంచి భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. సిరాజ్‌, బుమ్రా మెయిడిన్స్ వేశారు. దీంతో పరుగులు చేయడానికి కివీస్ ఓపెనర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇండియన్ బౌలర్లు మంచి స్టార్ట్ ఇవ్వడంతో న్యూజిలాండ్‌ స్కోరు 9 వద్ద ఓపెనర్‌ కాన్వే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ యంగ్‌ కివీస్‌ స్కోర్ 19 వద్ద అవుట్ అయ్యాడు. కాన్వేని సిరాజ్‌ అవుట్ చేస్తే.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన స్పీడ్‌ స్టార్‌ షమి యంగ్‌ని అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ బ్యాటింగ్ చేశారు.

చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తు, సింగిల్స్ రొటేట్ చేస్తూ రచిన్, డారిల్‌ మిచెల్‌ టీమిండియా బౌలర్లకు సవాల్‌గా నిలిచారు. ఈ ఇద్దరి పార్ట్‌నెర్‌షిప్‌ని బ్రేక్ చేసేందుకు రోహిత్ శర్మ చాలా కష్టపడాల్సి వచ్చింది. 19 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్‌ 178 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంటే మూడో వికెట్‌కు ఏకంగా 161 రన్స్ పార్ట్‌నెర్‌షిప్‌ నెలకొల్పారు. షమి ఈ జోడిని విడదీశాడు. 87 బంతుల్లో 75 రన్స్ చేసిన రచిన్ రవీంద్ర షమి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రచిన్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. మరోవైపు మిచెల్‌ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. అయితే మిచెల్‌కు అవతలి ఎండ్‌ నుంచి సహకారం అందించేవారే కరువయ్యారు. వరుస పెట్టి కివీస్‌ వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 300 పైగా రన్స్ చేస్తుందని భావించిన కివీస్‌ 273 పరుగులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు మిచెల్‌ మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు. 127 బంతుల్లో 130 రన్స్ చేసిన డాచిల్ మిచెల్‌ని షమి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

Also Read: జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి

#icc-world-cup-2023 #india-vs-newzealand
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe