రేపు(అక్టోబర్ 29) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. లక్నో(Lucknow) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఆడడం లేదు. నిజానికి న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లోనూ పాండ్యా ఆడలేదు. ఆ మ్యాచ్‌కు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీని, పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించారు. షమీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇటు సూర్యకుమార్ యాదవ్‌ని మాత్రం బ్యాడ్ లక్ వెంటాడింది. కోహ్లీ తప్పిదం వల్ల సూర్య రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇక రేపటి మ్యాచ్‌లో కూడా టీమిండియా మార్పులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అశ్విన్ వస్తాడా?
గత ఆరేళ్లలో కేవలం నాలుగే వన్డేలు ఆడిన అశ్విన్(RaviChandran Ashwin)ను వరల్డ్‌కప్‌కి సెలక్ట్ చేసి అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది బీసీసీఐ. వరల్డ్‌కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో అశ్విన్ ప్లేయంగ్-11లో ఉన్నాడు. తన హోం గ్రౌండ్ చెన్నై వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన ఆ మ్యాచ్‌లో అశ్విన్ పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అశ్విన్‌ను ఆడించలేదు రోహిత్.
ఇంగ్లండ్‌కు స్పిన్ రాదు బాసూ:
అటు రేపటి మ్యాచ్‌లో అశ్విన్‌ని ఆడిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దానికి బలమైన కారణం ఉంది. లక్నో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అటు ఇంగ్లండ్ ప్లేయర్లు స్పిన్ ఆడడంలో వీక్. ఇండియాలో ఆడిన ప్రతీసారి స్పిన్ దెబ్బకే ఇంగ్లీష్ బ్యాటర్లు బోల్తా పడుతుంటారు. అందుకే ఇదే అస్త్రంతో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ చెక్ పెట్టనున్నాడని తెలుస్తోంది. మరోవైపు అశ్విన్‌ను తుది జట్టులో ఆడిస్తే ఎవర్ని పక్కనపెట్టాలో అర్థంకాని దుస్థితి దాపరించింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో షమీ దుమ్మురేపాడు. అటు పేసర్లు సిరాజ్, బూమ్రాను పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చు. ఇటు స్పిన్నర్లగా జడేజాతో పాటు కులదీప్ యాదవ్ స్థాయికి తగ్గట్లుగా బౌలింగ్ వేస్తున్నారు. అందులో స్పిన్ పిచ్ కావడంతో ప్రధాన స్పిన్నర్లను పక్కనపేట్టలేని పరిస్థితి. దీనిబట్టి చూస్తే మరోసారి షమీనే బెంచ్‌కు పరిమితం అవుతాడని సమాచారం.
Also Read: కివీస్‌కు ‘హెడ్’నొప్పి.. కుమ్మేసిన కమ్మిన్స్.. బాదిపడేశారుగా!