వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నజ్ముల్ హొస్సేన్ శాంటో సేన డీసెంట్ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీలు చేశారు. అఖరిలో మహ్ముదుల్లా, రహీమ్ జట్టును ఆదుకున్నారు. ఇక భారత్ బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యాకు గాయమైంది. దీంతో అతను కేవలం 3 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు.
Also Read: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!
రాణించిన ఓపెనర్లు:
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. తన్జిద్, లిట్టన్ దాస్ భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అసలు టీమిండియా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా టెన్షన్ పెట్టారు. వరుస విరామాల్లో బౌండరీలు బాదుతూ సింపుల్‌గా రన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 43 బంతుల్లో 51 రన్స్ చేసిన తన్జిద్ హసన్ కుల్దీప్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగాడు. తన్జిద్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. తన్జిద్‌తో పాటు లితన్ దాస్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 93 రన్స్ చేసింది. ఇక తన్జిద్ అవుటైన తర్వాత కాసేపటికే కెప్టెన్ నజ్ముల్ జడేజా బౌలింగ్‌లో LBW అయ్యాడు. 17 బంతులు ఆడిన నజ్ముల్ కేవలం 8 రన్స్ చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మిరాజ్ కూడా తుస్సుమన్నాడు. 13 బాల్స్ ఆడి కేవలం 3 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే లిట్టన్ దాస్ కూడా అవుట్ అవ్వడంతో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడినట్టు అయ్యింది. 82 బంతుల్లో 66 రన్స్ చేసిన లిట్టన్ జడేజా బౌలింగ్‌లో గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. 93 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 137 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రహీమ్, మహ్ముదుల్లా రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు 200 మార్క్‌ను దాటింది. హాఫ్ సెంచరీవైపు ప్రయాణిస్తోన్న రహీమ్ 46 బంతుల్లో 38 రన్స్ చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరో మహ్ముదుల్లా వేగంగా రన్స్ చేయడంతో బంగ్లాదేశ్ 250 రన్స్ మార్క్‌ను దాటింది.
Also Read: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా?