Rohit Sharma: క్రికెట్ దేవుడి రికార్డులు బద్దలు కొట్టడానికే కోహ్లీ, రోహిత్ పుట్టినట్లు ఇప్పటికే అభిమానులు ఓ అభిప్రాయానికి వచ్చారు. సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్, కోహ్లీ బ్రేక్ చేస్తూ వస్తున్నారు. అటు కోహ్లీ ఓవరాల్‌గా సచిన్ రికార్డులను లేపేస్తుంటే.. ఇటు రోహిత్ వరల్డ్‌కప్ టోర్నీ పరంగా సచిన్ ఖాతాలో ఉన్న అనేక రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ రోహిత్ శర్మనే. ఇక నవంబర్ 19న జరగనున్న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
మరో 50 రన్స్ చేస్తే:
ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ అదరగొడుతున్నారు. ఓపెనర్‌గా వేగంగా బ్యాటింగ్ చేస్తూ క్విక్ స్టార్ట్ ఇస్తున్నాడు. దీని వల్ల జట్టులోని మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. వారంతా ఫ్రీగా బ్యాటింగ్ చేసుకుంటున్నారు. ఇలా పరుగుల పరంగా రోహిత్ కోహ్లీ తర్వాతి స్థానంలోనే ఉన్నా.. విన్నింగ్ ఇంపాక్ట్‌లో మాత్రం రోహిత్ అందరి కంటే ముందున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో 10 మ్యాచ్‌ల్లో రోహిత్ 550 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 124గా ఉంది. ఫైనల్‌లో రోహిత్ 50 చేస్తే అతని ఖాతాలో గొప్ప రికార్డు వచ్చి చేరుతుంది. వరుసగా రెండు వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్స్‌లో 600కు పైగా రన్స్ చేసిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు.
సచిన్ కూడా చేయలేదు:
వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి... సచిన్ ఆరు వరల్డ్‌కప్‌లు ఆడాడు.. అయితే ఏ రెండు ఎడిషన్స్‌లోనూ 600కు పైగా పరుగులు చేయలేదు. 2003 ప్రపంచకప్‌లో 673 రన్స్ చేశాడు. 1996 వరల్డ్‌కప్‌లో 523 రన్స్ చేశాడు. 2011 వరల్డ్‌కప్‌లో 482 రన్స్ చేశాడు. ఇటు రోహిత్ 2019 ప్రపంచకప్‌లో రోహిత్ 649 రన్స్ చేశాడు. ఫైనల్‌లో జరిగే మ్యాచ్‌లో 50 రన్స్ చేస్తే మరోసారి 600 రన్స్ మార్క్ దాటుతుంది. ఇలా ఇప్పటివరుకు ఏ దిగ్గజ క్రికెట్ కూడా చేయలేదు. ఫైనల్‌లో రోహిత్ రెచ్చిపోతాడని.. కచ్చితంగా ఈ కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: ‘తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..’ తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!