World Cup 2023: నాలుగు మ్యాచ్‌లు పక్కన పెట్టారు.. కసితీరా బౌలింగ్‌ చేసి అందరి నోళ్లు మూయించాడు!

వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై జరిగిన పోరులో టీమిండియా స్పీడ్‌ స్టార్‌ మొహమ్మద్ షమీ అదరగొట్టాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. వన్డేల్లో ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. వన్డేల్లో షమీ ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన ప్లేయర్లలో షమీనే టాప్‌. షమి 5సార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

New Update
World Cup 2023: నాలుగు మ్యాచ్‌లు పక్కన పెట్టారు.. కసితీరా బౌలింగ్‌ చేసి అందరి నోళ్లు మూయించాడు!

టీమిండియాలో చోటు దక్కించుకోవడమే కష్టం.. పోటి అంత ఎక్కువగా ఉంటుంది. ఏ గవర్నమెంట్‌ ఎగ్జామ్‌కి కూడా అంత పోటి ఉండదు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేది కేవలం 11 మందే. ప్రస్తుత 2023 ప్రపంచకప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. జట్టులో 15మంది సభ్యులు ఉండగా.. అందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వరల్డ్‌కప్‌లో షమి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇవాళే(అక్టోబర్ 22) న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ పాండ్యా గాయపడడంతో షమిని తుది జట్టులోకి తీసుకున్నారు. అటు శార్దూల్‌ ఠాకూర్‌ని పక్కన పెట్టి సూర్యను తీసుకున్నారు. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత సరైనదో ఫ్యాన్స్ కి తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో షమి దుమ్మురేపాడు.


టాస్‌ గెలిచి టీమిండియా మొదటగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ ఓపెనర్ల ఇద్దరిని త్వరగానే అవుట్ చేశారు భారత్ బౌలర్లు. నాలుగు మ్యాచ్‌ల్లో కనిపించని షమి ఈ వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడగా.. వచ్చి రావడంతోనే ఓపెనర్‌ విల్‌ యంగ్‌ వికెట్‌ని లేపేశాడు. అది కూడా క్లీన్ బౌల్డ్. ఆ తర్వాత రచిన్, డాచిల్ మిచెల్ మరో వికెట్ పడకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిసి 161 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పిన తర్వాత షమి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రచిన్ బోల్తా పడ్డాడు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్ లో శాంట్నర్, మ్యాట్ హెన్రి వికెట్‌ని కూడా షమి తీసేశాడు. ఇక ప్రమాదకరంగా మారి అప్పటికే సెంచరీ చేసిన డారిల్ మిచెల్‌ను సైతం షమి అవుట్ చేశాడు.

మొత్తం 10 ఓవర్లలో 54 పరుగులిచ్చిన షమి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ ద్వారా షమి ఖాతాలో కొన్ని రికార్డులు వచ్చి పడ్డాయి.. అవేంటో లుక్కేయండి.

➡ 3 - మొహమ్మద్ షమీ*
➡ 3 - జావగల్ శ్రీనాథ్
➡ 3 - హర్భజన్ సింగ్

ODIలో మొహమ్మద్ షమీకి చివరి 6 వికెట్లు
1) బౌల్డ్
2) బౌల్డ్
3) క్యాచ్‌
4) బౌల్డ్
5) బౌల్డ్
6) బౌల్డ్

ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన ప్లేయర్లు:

➡ 5 - మొహమ్మద్ షమీ*
➡ 2 - జస్ప్రీత్ బుమ్రా
➡ 2 - ఆశిష్ నెహ్రా
➡ 2 - జవగల్ శ్రీనాథ్
➡ 2 - ఉమేష్ యాదవ్
➡ 2 - యువరాజ్ సింగ్

Also Read: ‘ఫ్రెండ్‌షిప్‌ కోటాలో అతడిని ఆడిస్తున్నారా’? ‘రోహిత్‌.. ఏంటిది?’

Advertisment
Advertisment
తాజా కథనాలు