వరల్డ్‌కప్(World Cup)లో ఓటమి అనే పదానికి అర్థమే తెలియని జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమిండియా. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లకి ఆడితే ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు రోహిత్ సేన. తమకు గట్టి పోటి ఇస్తుందని భావించిన న్యూజిలాండ్ కూడా భారత్‌పై తేలిపోయింది. నెట్‌రన్‌రేట్‌లోనూ పాయింట్లలోనూ ఇండియాకు తిరుగేలేదు. ఇప్పటివరకు 10 పాయింట్లతో టీమిండియా టాప్ పొజిషన్‌లో ఉంది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే టీమిండియా సెమీస్‌కు వెళ్లడం దాదాపు ఖాయమే. ఇండియా ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తర్వాతి మ్యాచ్‌పై ఇంగ్లండ్(England)పై ఆడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 29న అంటే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది.
గాయంతో అవుట్:
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గాయపడ్డాడు. బౌలింగ్ వేసినప్పుడు బ్యాటర్ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్‌ని ఆపే క్రమంలో పాండ్యా కిందపడ్డాడు. దీంతో పాండ్యా కాలుకు గాయమైంది. ఇది కాస్త తీవ్రమైనదిగానే తెలిసింది. బంగ్లాదేశ్‌పై మ్యాచ్ తర్వాత ఇండియా న్యూజిలాండ్‌పై ఆడింది. ఆ మ్యాచ్‌లో పాండ్యా ఉండడని ముందుగానే బీసీసీఐ చెప్పింది. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని రోహిత్ తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం పాండ్యా తర్వాత మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. అంతేకాదు.. ఇంగ్లండ్‌పై మ్యాచ్ తర్వాత శ్రీలంకతో భారత్ తలపడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌కు కూడా పాండ్యా అందుబాటులో ఉండడంలేదు. అంటే తర్వాతి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ లేకుండానే రోహిత్ సేన బరిలోకి దిగాల్సి ఉంటుంది.
Also Read: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్!
పాండ్యా ముఖ్యమే బాసూ:
పాండ్యా లేకపోవడం టీమిండియాకు మైనస్‌గానే చెప్పాలి. బ్యాట్, బాల్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ పాండ్యా సేవలు ఇండియాకు అవసరం. పాండ్యా లేకపోవడం వల్ల అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వస్తున్నాడు. సూర్యకుమార్ బౌలింగ్ చేయడు. అటు గత మ్యాచ్‌లో స్టార్ బౌలర్ షమీ తుది జట్టులోకి వచ్చి దుమ్మురేపాడు. అసలు షమీని ఇంతకాలం ఎందుకు పక్కనపెట్టారురా అని ఫ్యాన్స్ అనుకునేలా షమీ ఇరగదీశాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో షమీని తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ బౌలర్‌గా అంత హిట్ అవ్వడంలేదు.. అయితే బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేయగలడు. పోని సూర్యకుమార్‌ని కాకుండా శార్దూల్‌నే తుది జట్టులోకి తీసుకుంటే అప్పుడు బ్యాటింగ్ కాస్త వీక్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వన్డేల్లో మంచి ప్లేయర్ కాకున్నా.. సూర్యకుమార్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఏం చేయాలన్నదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ దీర్ఘంగా ఆలోచిస్తోంది.
Also Read: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్ మార్క్ ‘ఆయుధ పూజ’ ఇది!