/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-team-3-jpg.webp)
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సెమీస్‌కి వస్తారని.. ఇండియాను మట్టి కరిపించి ఫైనల్‌కు వెళ్తారని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఏవేవో కలలు కన్నారు. మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ దుమ్మురేపింది. దీంతో వారి కలలు ఫైనల్‌కు వెళ్లడం నుంచి కప్ కొట్టడం.. బాబర్ అజామ్ ఆ కప్‌ను ముద్దుపెట్టుకోవడం వరకు వెళ్లాయి. అక్టోబర్14 వరకు అలానే ఉన్న వారి డ్రీమ్స్‌పై టీమిండియా నీళ్లు చల్లింది. వెంటనే ఉలిక్కిపడి లేచారు పాక్ అభిమానులు. అప్పటినుంచి పాపం నిద్రే పోలేదు.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది పాకిస్థాన్. దీంతో పాక్ జట్టుపై సోషల్‌మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వని ఐస్‌ల్యాండ్ టీమ్ కూడా పాక్‌ను ట్రోల్ చేస్తుందంటే బాబర్ టీమ్ సపోర్టర్స్ బాధ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మాతో వచ్చి ఆడండి:
ట్విట్టర్‌లో ఐస్‌ల్యాండ్ క్రికెట్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. ఇది సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. ఇక ఆడింది చాలు.. మాతో వచ్చి క్రికెట్ సిరీస్ ఆడాలంటూ చురకలంటించింది. '1992 ప్రపంచ కప్ ఫైనలిస్టులు ఈ సిల్లీ గ్లోబల్ టోర్నమెంట్‌ను విడిచిపెట్టి, మాతో ట్రై-సిరీస్ ఆడాలి. ఇది ఆట అభివృద్ధికి మంచిది' అంటూ ట్వీట్ చేసింది. 1992లో పాకిస్థాన్ జట్టు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాక్ టీమ్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సారి కూడా పాక్ టీమ్ గెలుస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ భావించగా.. బాబర్ టీమ్ బొక్క బోర్లా పడింది.
The 1992 World Cup finalists should leave this silly global tournament and play a tri-series with us. It will be good for the development of the game and get the statistics back in order. Discuss.
— Iceland Cricket (@icelandcricket) October 27, 2023
ఇక కష్టమే:
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాక్ ఆరో స్థానంలో ఉంది. పాక్ టీమ్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా నెగిటివ్స్‌లో ఉంది. తర్వాతి మూడు మ్యాచ్‌లను బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌పై ఆడనుంది. ఈ నెల 31న బంగ్లాదేశ్‌తో తలపడనుంది పాక్. ఒకవేళ బంగ్లాపై గెలిచినా.. తర్వాతి మ్యాచ్ కివీస్‌తో గెలుపు అంత ఈజీ కాదు. ప్రస్తుత పాక్ జట్టు ఆటతీరు చూస్తే సెమీస్‌కు వెళ్లడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. అయితే క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.. అందుకే ఇప్పుడే ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదు.
Also Read: ఆస్ట్రేలియా గెలవడానికి అసలు కారణం ఇదే.. ఎవరైనా అడిగితే ఈ ప్రూఫ్స్ చూపించండి!