Shubman Gill: అంత ఆవేశం ఎందుకు భయ్యా.. నంబర్‌-1 ర్యాంకును చేజేతులా వదులుకుంటున్న గిల్‌!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ గిల్ నంబర్‌-2 పొజిషన్‌లో ఉన్నాడు. నంబర్‌-1లో పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ ఉన్నాడు. డెంగీ నుంచి కోలుకున్న తర్వాత గిల్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. క్లాసిక్‌ షాట్లలో ఓవైపు అలరిస్తూనే మరోవైపు ఏదో ఒక బంతికి చెత్త షాట్‌ఆడి అవుట్ అవుతున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నంబర్‌-1 ర్యాంకును చేరుకునే అవకాశాన్ని చేజేతులా మిస్‌ చేసుకుంటున్నాడంటూ బాధ పడుతున్నారు.

New Update
Shubman Gill: అంత ఆవేశం ఎందుకు భయ్యా.. నంబర్‌-1 ర్యాంకును చేజేతులా వదులుకుంటున్న గిల్‌!

ఐసీసీ ఈవెంట్లలో 20 ఏళ్ల తరువాత న్యూజిలాండ్ ను ఓడించింది టీమిండియా. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్.. భారీ స్కోర్ చేసేలా కనిపించింది. రచిన్ రవీంద్ర క్యాచ్‌ను జడేజా నేలపాలు చేయడం మొదట్లో టీమిండియా కొంపముంచింది. రచిన్ రవీంద్ర కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పార్టనర్ గా ఉన్న డారియల్ మిచెల్ కూడా అంతే చెలరేగాడు. అయితే, లాస్ట్ లో షమీ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో.. కివీస్ 273 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత ఏ బ్యాటర్‌నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు ఇండియన్ బౌలర్లు. డారిన్ మిచెల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు


గిల్‌.. ప్చ్:
ఇక ఈ మ్యాచ్ లో 26 రన్స్ కే అవుట్ అయిన గిల్(Shubman gill) పై ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. 274 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. కానీ, ఆ తరువాత ఆ షార్ట్ బాల్‌ను ఆడబోయి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు శుభ్‌మన్ గిల్. మంచి టచ్‌లో కనిపిస్తున్న ఈ యంగ్ ఓపెనర్ అదే ఫామ్ కొనసాగిస్తే.. వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నంబర్ వన్ ర్యాంకులో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో..గిల్ నంబర్ వన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ గిల్ మాత్రం ఇలా చెత్త షాట్లు ఆడి అవుట్ అవుతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

టాప్‌ ర్యాంక్‌ కోసం గట్టి పోటి:
వన్డేల్లో టాప్ బ్యాటర్ ర్యాంకు ఎలాగైనా గిల్‌కు వచ్చేస్తుందకున్న ఫ్యాన్స్.. ఇలా గిల్ తేలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్ తన ర్యాంకు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నా.. గిల్ మాత్రం దాన్ని తీసుకోవడం లేదు. కొంచెం బెటర్ గా ఆడితే ఈ ర్యాంక్ వచ్చేస్తుందని... కానీ, గిల్ మాత్రం ఫెయిల్ అవుతున్నదని ఫ్యాన్స్ చిరాకు పడ్తున్నారు. మరోవైపు నంబర్ వన్ ర్యాంక్ వద్దు ఏంట్రా అంటూ గిల్ పై మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Also Read: విరాట్‌ కోహ్లీ-సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్‌ సీన్‌పై సజ్జనార్ ట్వీట్ వైరల్!

Advertisment
తాజా కథనాలు