IND vs NZ: వామ్మో.. మళ్లీ అదే జరుగుతుందేమోనన్న టెన్షన్.. దేవుడా.. ప్లీజ్‌ అలా చేయకు..!

2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. నవంబర్‌ 15న ముంబై వాంఖడే వేదికగా ఇండియా మరోసారి కివీస్‌పైనే తలపడనుండడంతో గతంలో జరిగిన ఓటమి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

New Update
IND vs NZ: వామ్మో.. మళ్లీ అదే జరుగుతుందేమోనన్న టెన్షన్.. దేవుడా.. ప్లీజ్‌ అలా చేయకు..!

ICC WORLD CUP 2023 SEMIS: సెమీస్‌ వరకు అయితే హ్యాపీగా వచ్చేశాం.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇరగదీశాం. అసలు టైట్‌గా జరిగిన మ్యాచ్‌ కూడా లేదు. ఇండియా దెబ్బకు ప్రత్యర్థులు హడలిపోయాయి. సెమీస్‌ వరకు కింగ్‌లా ఆడిన మనం సెమీస్‌లో ఎలా ఆడబోతున్నాం అన్నదానిపై ఫ్యాన్స్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఫేస్ చేయబోయేది న్యూజిలాండ్‌(Newzealand)ను కావడంతో కొందరిలో టెన్షన్ కనిపిస్తోంది. 2019 ప్రపంచకప్‌ గ్రూప్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టీమిండియా సెమీస్‌(Semis)లో చతికిలపడింది. అప్పుడు కూడా న్యూజిలాండ్‌తోనే సెమీస్‌ ఫైట్ జరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read: టీమిండియా దివాళీ సెలబ్రేషన్స్…ట్రెడిషనల్ లుక్‎లో అదరగొట్టిన ఆటగాళ్లు..!!

అప్పుడేం జరిగిందంటే?
2019 ప్రపంచకప్‌(WorldCup)లో టైటిల్‌ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన నాటి కోహ్లీ సేన సెమీస్‌లో ఇంటిముఖం పట్టింది. న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. లక్ష్యఛేదనలో టీమిండియా తస్సుమంది. ఓపెనర్లు రాహుల్, రోహిత్‌తో పాటు కోహ్లీ ముగ్గురు తలో ఒక్క పరుగు చేశారు. అంటే ముగ్గురు కలిపి మూడు రన్స్ చేశారు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌ కాసేపు నిలపడ్డాడు. పాండ్యా కూడా పర్వాలేదనిపించాడు. మ్యాచ్‌ ముగిసిపోయిందిలే అనుకున్న సమయంలో జడేజా ఆదుకున్నాడు. వేగంగా రన్స్ చేస్తూ ధోనీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. 59 బంతుల్లోనే 79 రన్స్ చేసిన జడేజా బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా.. మ్యాచ్‌ను గెలిపిస్తాడనుకున్న ధోనీ రనౌట్ కావడంతో భారత్‌ ఓటమిని మూటగట్టుకుంది.

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు:
నిజానికి వరల్డ్‌కప్‌ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ 20ఏళ్లలో ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ న్యూజిలాండ్‌పై ఇండియా గెలవలేదు. ఈసారి గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఇండియా చిత్తు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా టీమిండియా ఫుల్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ సారి సెమీస్‌లో న్యూజిలాండ్‌ మట్టికరిపిస్తుందని కొంతమంది భారత్‌ అభిమానులు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం టెన్షన్ పడుతున్నారు.

Also Read: ఎన్నెన్ని మాటలు అన్నారు భయ్యా.. ఇప్పుడెక్కడున్నారో బ్రో మీరంతా?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు