Mohammed Rizwan acting: 'గ్రౌండ్‌లో బ్యాటింగ్ తప్ప అన్నీ చేస్తాడు..' ఔటైతే క్రాంప్స్ అని నటిస్తాడు.. ఫీల్డర్లను తిడతాడు..' అతని రూటే సపరేటు..! టాలెంట్‌లో ఏ మాత్రం తక్కువ కాదు కానీ.. పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ నిత్యం ఏదో ఒక వింత చర్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. కొన్నిసార్లు వివాదాస్పద చర్యలతోనూ నిలుస్తుంటాడు. ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ యాక్టింగ్ చేశాడంటూ సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. ఇది యాక్టింగ్ కాదు.. ఓవర్ యాక్టింగ్ అంటూ ఫైర్ అవుతున్నారు. క్రికెట్ ఆడమంటే షారుఖ్ ఖాన్‌లాగా యాక్టింగ్ చేస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఔటైతే పెవిలియన్‌కు పోవాలి కానీ.. క్రాంప్స్ పేరుతో డ్రామాలు వద్దని సూచిస్తున్నారు.
ఏం జరిగిందంటే?
338 పరుగుల టార్గెట్‌తో పాక్ బరిలోకి దిగింది. అప్పటికీ సెమీస్ ఛాన్స్ లేదని తెలిసిపోయింది. గ్రూప్‌లో చివరి మ్యాచ్ కదా కనీసం గెలుద్దాం అన్న ఆలోచన కూడా పాక్‌కు లేకుండా పోయింది. చాలా రెక్‌లెస్‌గా బ్యాటింగ్ చేశారు. కాస్తో కూస్తో బాధ్యతగా బ్యాటింగ్ చేసే ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రిజ్వాన్ కూడా చాలా నిర్లక్ష్యంగా ఔట్ అయ్యాడు. 22.2 ఓవర్లలో 100 పరుగులు చేసిన పాక్ అప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్నడనుకున్న రిజ్వాన్ ఫ్రంట్‌ఫుట్‌కి వచ్చి గుడ్డిగా బ్యాట్ ఊపాడు. ఇంకేముంది బాల్ వికెట్లను తాకింది.
ఎందుకు బ్రో యాక్టింగ్:
ఇక్కడ వరకు బాగానే ఉంది. ఔటైన తర్వాత రిజ్వాన్ కామ్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోయి ఉంటే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. అయితే మనోడు మాత్రం వికెట్ అలా పడిందో లేదో ఇలా కిందపడ్డాడు.. కాళ్లు పట్టుకోని క్రాంప్స్ అన్నాడు. అయితే రిజ్వాన్‌కి నిజంగానే ఇబ్బంది ఉందేమో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఇదంతా యాక్టింగ్ అంటున్నారు. కావాలనే రిజ్వాన్ అలా నటిస్తున్నాడని చెబుతున్నారు. శ్రీలంకపై మ్యాచ్‌లోనూ రిజ్వాన్ ఇలానే చేశాడని గుర్తుచేస్తున్నారు.
Also Read: ఒక్క బంతికి 286 రన్స్.. ఈ మేటర్ తెలుసుకుంటే పిచ్చెక్కిపోద్ది భయ్యా!
WATCH: