AFG vs AUS: అఫ్ఘాన్‌ మరోసారి ప్రకంపనలు రేపుతుందా? ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..!

వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్ఘానిస్థాన్‌ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జ‌ద్రాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

AFG vs AUS: అఫ్ఘాన్‌ మరోసారి ప్రకంపనలు రేపుతుందా? ఆస్ట్రేలియా టార్గెట్‌ ఎంతంటే..!
New Update

WORLD CUP 2023: వరల్డ్‌కప్‌లో ఇప్పటివరుకు మూడు సార్లు ప్రత్యర్థి జట్లను మట్టికరిపించిన అఫ్ఘాన్‌(Afghanistan) మరోసారి అదే సీన్‌ రిపీట్ చేయాలని భావిస్తోంది. ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా(Australia)పై జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ డీసెంట్ స్కోరు సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి స్కోరే కానీ.. ముంబై పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండడంతో ఆస్ట్రేలియా ఛేజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు క్రికెట్ లవర్స్‌. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 రన్స్ చేసింది. పాక్‌ ఓపెనర్‌ ఇబ్రహిం జడ్రన్‌ సెంచరీతో మెరిశాడు.


ఇబ్రహిం.. వారేవ్వా:
ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న అఫ్ఘానిస్థాన్‌ వరల్డ్‌కప్‌ సెంచరీ లోటు తీరిపోయింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఇబ్రహీం జ‌ద్రాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ దిగిన అఫ్ఘాన్‌ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 25 బంతుల్లో 21 రన్స్ చేసిన అఫ్ఘానిస్థాన్‌ హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు చిక్కాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రెహ్మత్‌ షాతో కలిసి ఇబ్రహిం స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ సింగిల్స్‌ రోటేట్ చేస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఈ జోడిని వీడదీశాడు. 44 బంతుల్లో 30 రన్స్ చేసిన రెహ్మత్‌ షా మ్యాక్సి బౌలింగ్‌లో హెజిల్‌వుడ్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ షాహీది కూడా ఆచుతూచీ బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు స్లోగా కదిలింది. 37.2 ఓవర్లలో జట్టు స్కోరు 173 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షాహీదిని స్టార్క్‌ క్లీన్‌ బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఇబ్రహిం మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.


ఓ క్రమంలో బ్యాటింగ్‌ స్లోగా సాగడంతో అఫ్ఘాన్‌ 270 పరుగులకు పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ అజ్మతుల్లాతో పాటు రషీద్‌ ఖాన్‌ వేగంగా బ్యాటింగ్‌ చేయడంతో అఫ్ఘాన్‌ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో విరుచుకపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు రషీద్‌ఖాన్‌. మరో ఎండ్‌లో ఇబ్రహీం జ‌ద్రాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 143 బంతుల్లో 129 రన్స్ చేసిన ఇబ్రహిం తన బ్యాటింగ్‌ శైలీతో క్రికెట్‌ లవర్స్‌ను ఫిదా చేశాడు. ఇబ్రహిం సెంచరీతో పాటు రషీద్‌ దూకుడుతో అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 291 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజిల్‌వుడ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read: వికెట్లు తంతాడు.. అంపైర్లను బూతులు తిడతాడు.. పెద్ద తొండిగాడు..!

WATCH: 

#icc-world-cup-2023 #afghanistan-vs-australia #ibrahim-zadran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe