క్రికెట్ ఆడని ఊరు ఉండదు.. క్రికెట్ తెలియని గల్లీ ఉండదు.. క్రికెట్ ఆడిన వాళ్లలో చాలా మంది ఓ సీన్‌ను ఫేస్ చేసి ఉంటారు. మనం క్రికెట్ ఆడుతుంటే పొదల్లోకి బాల్ వెళ్లడం.. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లకు బాల్ కనిపించకపోవడం.. దొరికిందే సందు కదా అని పరుగు పరుగున బ్యాటర్లు రన్స్ తీసేయడం లాంటివి అందరూ చూసే ఉంటారు. అయితే ఎంత కాదనుకున్నా మహా అయితే 5 నుంచి 6 పరుగులు తియ్యగలరు మన గల్లీ ప్లేయర్స్. తర్వాత అలిసిపోతారు. క్రీజులో కూర్చిండిపోతారు. ఇంతలోనే ఎవడో రూల్స్ తెలియని వాడు వచ్చి 3 రన్స్ కంటే ఎక్కువ తియ్యకూడదంటాడు.. అంపైర్‌తో గొడవ పెట్టుకుంటాడు.. ఆ మధ్యలోకి రూల్స్ తెలిసిన వాడు వచ్చి ఎన్ని రన్స్ అయినా తీసుకొవచ్చని ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పి నోరు మూయిస్తాడు. ఇక ఇదంతా మన ఇండియాలోనే జరుగుతుందనుకుంటే అది మీ బ్యాట్‌ని మీ నెత్తికేసి కొట్టుకోవడం లాంటిదే. మనకంటే వందల ఏళ్ల క్రితమే క్రికెట్ బ్లడ్‌లో నరనరానా ఎక్కించుకున్న కంట్రీ ఆస్ట్రేలియా. ఒకసారి ఆ దేశంలో జరిగిన మ్యాచ్‌లో ఒక్క బంతికి 286 పరుగులు చేశారంటే నమ్మగలరా?
మొదటి బంతికే 286 రన్స్:
తేది- జనవరి 15
సంవత్సరం- 1894
వేదిక - బన్‌బరీ
విక్టోరియా వర్సెస్ స్క్రాచ్-11 టీమ్ మధ్య మ్యాచ్ మొదలైంది. స్క్రాచ్-11 టీమ్‌లో ఎక్కువ మంది వెస్ట్రన్ ఆస్ట్రేలియా టీమ్ మెంబర్స్ ఉన్నారు. అప్పుడే మ్యాచ్ మొదలైంది. మొదటి బంతిని గాల్లోకి లేపాడు ఓపెనర్. అయితే గ్రౌండ్ బౌండరీ రోప్‌కు కాస్త ముందు ఒక చెట్టు ఉంది. అది ఎత్తైనా జర్రా చెట్టు. బ్యాటర్ కొట్టిన బంతి ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. ఇక బ్యాటర్లు 'హీ..హీ..హీ' అని ఆనందపడుతూ రన్స్ తియ్యడం మొదలుపెట్టారు. ఫీల్డర్లరకు ఏం చేయాలో అర్థం కాలేదు.. చెట్టు చాలా స్ట్రాంగ్.. బాల్ ఇరుక్కున్న కొమ్మ చాలా ఎత్తులో ఉంది. అంతవరకు చెట్టుపైకి ఎవరూ ఎక్కలేకపోయారు. బౌండరీ బయట ఉన్న రాళ్లు తీసుకొచ్చి ఆ స్టోన్స్‌తో బంతిని కొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఏం లాభం లేకపోయింది. ప్రత్యర్థి కెప్టెన్‌కు బీపీ పెరిగిపోయింది. అక్కడున్న గొడ్డలి తీసుకురండిరా చెట్టును నరికేస్తానని కోపం తెచ్చుకున్నాడు. ఇంతలో ఫీల్డర్లు అతడిని కూల్ చేశారు.
తొలి బంతికే డిక్లేర్:
ఇంతలోనే ఒక ఫీల్డర్ రైఫిల్‌ను తీసుకువచ్చాడు. బంతికి గురి పెట్టాడు. చాలా సార్లు మిస్ అయ్యింది కానీ చివరికి బంతికి తగిలి బాల్ కిందపడింది. అయితే బంతి గ్రౌండ్‌కు టచ్ అయ్యేలోపు ఎవరూ పట్టుకోలేకపోయారు. ఈ లోపు 286 రన్స్ చేశారు బ్యాటర్లు. తొలి బంతికే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ కూడా చేశారు.
ఇదంతా నిజమేనా?
నిజానికి ఈ ఘటన జరిగినట్లు రుజువు చేయడానికి ఎలాంటి స్ట్రాంగ్ ఆధారాలు లేవు. ఈ సీన్‌కు సంబంధించిన మూలాలు లండన్‌లోని ప్రముఖ వార్తాపత్రిక 'పాల్ మాల్ గెజెట్'లో ఉంది. ఇప్పటివరకు ఈ ఘటన గురించి రాసిన వాళ్లంతా ఈ గెజెట్‌ను కోట్ చేస్తూనే రాశారు. అయితే నిజానికి ఇది నిజం కాదంటారు విశ్లేషకులు. ఒక బంతికి 286 రన్స్ తియ్యడం అంటే అది ఆగకుండా 6కిటోమీటర్లు పరిగెత్తినట్లు అని చెబుతున్నారు. ఇది సాధ్యం కాదని.. ఇదో అద్భుతమైన కథ అని కొట్టిపారేస్తున్నారు.
Also Read: ఆరుసార్లలో ఐదుసార్లు అట్టర్ ఫ్లాప్.. పాకిస్థాన్ పరమ చెత్త రికార్డు ఇది!
WATCH: