రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు బాధలు తప్ప జీవితంలో ఇంకేమి కనిపించవు. ఏం చేసినా.. ఏం చేద్దామనుకున్నా అడ్డంకులే ఎదురవుతాయి. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.. ఈ కష్టాలను, బాధలను తట్టుకోలేక ఆత్మహత్యే ఆప్షన్ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు.. మనిషికి కష్టాలు, బాధలు సర్వసాధారణం.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మనకంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ టైమ్‌ను మనమే తెప్పించుకోవాలి.. కష్టాలను మనమే తరిమికొట్టేలి. బాధలను అధిగమించాలి. కన్నీళ్లతో పోరాడిన వారే విజయాలను అందుకుంటారు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ జీవితమే అందుకు బెస్ట్ ఎగ్జాంపూల్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమోగుతున్న పేరు షమీ.. ఎక్కడ చూసినా షమీ గురించే చర్చ.
ఇన్నాళ్లు పక్కనపెట్టారు:
వరల్డ్‌కప్ టీమ్‌లో షమీ ప్లేస్ కన్ఫామ్ చేసుకున్నాడే కానీ.. తుది జట్టులోకి మాత్రం షమీ రావడానికి నాలుగు మ్యాచ్‌లు వేచి ఉండాల్సి వచ్చింది. పాండ్యాకు గాయమైతే కానీ షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. వచ్చి రావడంతోనే న్యూజిలాండ్‌పై అదరగొట్టిన షమీ ఏకంగా 5 వికెట్ల తో మెరిశాడు. తర్వాత ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్లు, తాజాగా శ్రీలంకపై ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. మొత్తంగా ఈ వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు షమీ. శ్రీలంకపై ఐదో వికెట్ తీసిన తర్వాత దేవుడిని తలచుకుంటూ గ్రౌండ్‌పై రెండు చేతులతో వాలిపోయిన షమీని చూస్తే ఈ స్థితికి రావడానికి షమీ పడిన బాధలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. షమీని అలా చూసిన వారికి గతమంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. చాలా మంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.
ఆత్మహత్య ఆలోచనల నుంచి విజేతగా:
మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న షమీ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. భార్య విషయంలో చేయకూడదని తప్పలేవో చేశాడు. కోర్టుల్లోనూ ఎదురుదెబ్బలు తిన్నాడు. కుటుంబమంతా ఒకవైపు షమీ ఒక్కడే ఇంకోవైపు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ షమీకి కాంట్రాక్ట్ కూడా ఆపేసింది. టీమ్ నుంచి పక్కనపెట్టింది. షమీ భార్య అతనిపై చేసిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజం లేదని నిర్ధారించకున్న తర్వాతే మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేలా చేసింది. అంతకముందు ఫామ్‌లేక దాదాపు ఏడాదిన్నర కాలం షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇలా వ్యక్తిగతంగాను, కెరీర్‌పరంగానూ ఎన్నో బాధలు పడ్డ షమీకి మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఈ విషయాన్ని షమీనే గతంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడా రోజులు లేవు.. ప్రపంచకప్‌లో షమీ రారాజు.. షమీని పక్కన పెట్టే సాహసం టీమిండియా మరోసారి చేయకపోవచ్చు. షమీ లేని పేస్ దళాన్ని సగటు భారత్ క్రికెట్ అభిమాని ఇప్పుడు ఊహించుకోలేడు. దటీజ్ షమీ..!
Also Read: World Cup 2023: అదే జరిగితే సెమీస్ లో భారత్-పాక్ పోరు.. ఆ ఛాన్స్ ఎంత? - Rtvlive.com