రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు బాధలు తప్ప జీవితంలో ఇంకేమి కనిపించవు. ఏం చేసినా.. ఏం చేద్దామనుకున్నా అడ్డంకులే ఎదురవుతాయి. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.. ఈ కష్టాలను, బాధలను తట్టుకోలేక ఆత్మహత్యే ఆప్షన్ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు.. మనిషికి కష్టాలు, బాధలు సర్వసాధారణం.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మనకంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ టైమ్‌ను మనమే తెప్పించుకోవాలి.. కష్టాలను మనమే తరిమికొట్టేలి. బాధలను అధిగమించాలి. కన్నీళ్లతో పోరాడిన వారే విజయాలను అందుకుంటారు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ జీవితమే అందుకు బెస్ట్ ఎగ్జాంపూల్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారుమోగుతున్న పేరు షమీ.. ఎక్కడ చూసినా షమీ గురించే చర్చ.
పూర్తిగా చదవండి..Shami: మూడు సార్లు చనిపోదాం అనుకున్నాడు.. కట్ చేస్తే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు!
ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లతో రఫ్పాడించిన షమీ పేరు మరోసారి క్రికెట్ సర్కిల్స్‌లో మారుమోగిపోతోంది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో బాధలు పడ్డ షమీ గతంలో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
Translate this News: