World cup 2023: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. బీసీసీఐ ఏం చేసిందో తెలుసా?

టీమిండియా ప్లేయర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది బీసీసీఐ. తీరిక లేని షెడ్యూల్‌తో అలిసిపోతున్న భారత్ ఆటగాళ్లకు కాస్త బ్రేక్‌ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత కాస్త బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక మూడు రోజుల గ్యాప్‌ తర్వాత అక్టోబర్ 26 నాటికి ప్లేయర్లు అందరూ లక్నో చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
World cup 2023: టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. బీసీసీఐ ఏం చేసిందో తెలుసా?

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నిట్లో ఫుల్ ఫామ్ లో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విన్ అయి.. పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరోవైపు ఆదివారం న్యూజిల్యాండ్ ని ఢీ కొట్టేందుకు రెడీ అయింది. అయితే, ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: IND vs NZ: పాండ్యా స్థానంలో నంబర్‌ -1 బ్యాటర్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! - Rtvlive.com
బ్యాటింగ్‌లో రోహిత్, గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అదరగొడుతుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా ప్రత్యర్థుల పని పడుతున్నారు. ఇలా విరామం లేకుండా మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లకు కాస్త బ్రేక్ ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ తరువాత.. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ తో ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ అక్టోబర్ 29 న జరగనుండడంతో.. ప్లేయర్లకు కాస్త బ్రేక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ కాస్త గ్యాప్ లో ఓ మూడురోజులపాటుప్లేయర్లు తమ ఫ్యామిలీ మెంబెర్స్ తో గడిపేందుకు పర్మిషన్ ఇచ్చింది.

ఆసియా కప్ నుంచి టీమిండియా ప్లేయర్లు వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నారు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ప్రయాణాలు, మ్యాచ్‌లతో క్రికెటర్లు అలసిపోతున్నారని.. అందుకే న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత కాస్త బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు బీసీసీఐ చెప్తోంది. మరోవైపు ఈ గ్యాప్ కారణంగా ఫామ్ కోల్పోయే ఛాన్స్ ఉందని.. అక్టోబర్ 26 నాటికి ప్లేయర్లు అందరూ లక్నో చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఇండియా ఈ వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.

Also Read: IND vs NZ: టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్‌లో ఆ స్టార్ బౌలర్! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు