World Cup: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్‌!

ఈ వరల్డ్‌కప్‌లో పాక్‌ జట్టు ఆట మ్యాచ్‌ మ్యాచ్‌కు మరింత తీసికట్టుగా మారుతోంది. పసికూన అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లోనూ పాక్‌ ఓడిపోయింది. ఇదే సమయంలో పాక్‌ ఓపెనర్‌ ఇమామ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. సిక్సులు కొట్టడానికి మరింత ప్రొటీన్‌ అవసరం అని.. పిండిపదార్థాలు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు ఇమామ్‌. అయితే అతనికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎలా కౌంటర్లు వేశారో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

New Update
World Cup: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్‌!

క్రికెట్‌ ఆడడానికి ఫిట్‌నెస్‌ అవసరమే.. లేకపోతే ఎఫెక్టీవ్‌ ఫీల్డింగ్‌ చేయలేం.. వికెట్ల మధ్య పరిగెత్తలేం.. వేగంగా బౌలింగ్‌ చేయలేం.. ఎక్కువగా గాయలు పాలయ్యే అవకాశం కూడ ఉంటుంది. అయితే బ్యాటింగ్‌లో సిక్సులు బాదడానికి, టన్నుల కొద్ది పరుగులు చేయడానికి, ఫీల్డింగ్‌ గోడలను బ్రేక్‌ చేస్తూ ఫోర్లు కొట్టడానికి జిమ్‌ ఫిట్‌నెస్‌ అవసరంలేదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. క్రికెట్‌ ప్రేమికులను, చాలా కాలంగా ఆటను ఆస్వాదిస్తున్న వారిని అడిగితే చెబుతారు. అదికూడా విత్‌ ఎగ్జాంపుల్స్‌తో. టీమిండియా మాజీ ఓపెనర్ డాషింగ్‌ ప్లేయర్‌ సెహ్వాగ్‌ ఫిట్‌నెస్‌ అంతంతమాత్రమే..అయినా సెహ్వాగ్‌(Sehwag) మ్యాచ్‌ విన్నర్‌. వేగంగా స్కోర్‌ చేస్తూ తర్వాత దిగే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించే ప్లేయర్‌ అతను. టెస్టు్‌ల్లో రెండు సార్లు ట్రిపుల్‌ సెంచరీ బాదిన ప్లేయర్‌ సెహ్వాగ్‌. ఇక క్రికెట్‌లో లెజెండరీ బ్యాటర్లలో ఒకరైన ఇంజమామ్‌ ఉల్ హక్‌(Inzamam-ul-Haq) భారీ శరీరాన్ని కలిగి ఉంటాడు. అతని బాడీలో ఎక్కువగా ఫ్యాటే(కొవ్వు) కనిపిస్తుంది. అయినా ఇంజమామ్‌ లాంటి బ్యాటర్‌ పాక్‌కు ఇప్పటివరకు దొరకలేదు. అటు సిక్సులు కొట్టడానికి పిండిపదార్థాలు కాదు.. ప్రొటిన్‌ ఎక్కువగా తీసుకోవాలంటూ పాక్‌ ప్లేయర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(Imam ul Haq) పెట్టిన ట్వీట్‌కు ఓ నెటిజన్ ఇచ్చిన రీట్వీట్‌ రిప్లై నెట్టింట్లో వైరల్‌గా మారింది.


ప్రొటీన్‌ కాదు.. టెక్నిక్‌ కావాలి:
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌(World cup)లో పాకిస్థాన్‌ ఘోరపరజయాలను మూటగట్టుకుంటోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఆ తర్వాత వరుసపెట్టి మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది పాక్‌. దీంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌పై సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. సిక్సులు కొట్టడానికి పిండిపదార్థాలు కాకుండా ప్రొటిన్‌ ఇన్‌టేక్‌ పెంచాలంటూ ఇమామ్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. సిక్సులు కొట్టడానికి కావాల్సింది ప్రొటీన్‌ కాదని.. టెక్నిక్‌ అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మీ మామయ్యను చూసి నేర్చుకో:
ఇమామ్‌ ఉల్‌ హక్‌ ట్వీట్‌కు భారత్ క్రికెట్‌ ఫ్యాన్‌ పూజా (@DuddWiser) ఇచ్చిన రిప్లై ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ని ఎగ్జాంపుల్‌గా చెబుతూ ఆమె ఇమామ్‌కు కౌంటర్ వేశారు. 40శాతం బాడీ ఫ్యాట్‌తో ఇంజమామ్‌ ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అందులోనూ ఇంజమామ్‌కి ఇమామ్‌ ఉల్‌ హక్‌కి మేనల్లుడు. పూజ ట్వీట్‌లో ఫ్యాక్ట్ ఉందంటున్నారు నెటిజన్లు. టెక్నిక్‌ లేకుండా ఫిట్‌నెస్‌ ఉన్నా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఇంజమామ్‌ యూనిక్‌ ప్లేయర్‌. బౌండరీలతోనే ప్రత్యర్థి జట్లకు చమటలు పట్టించిన ఆటగాడు ఇంజమామ్‌. వన్డేల్లో 10 వేలకు పైగా రన్స్ చేసిన బ్యాటర్లలో ఇంజీ ఒకరు.

Also Read: ఆడడానికి వచ్చారా.. మెక్కడానికి వచ్చారా? ఏకంగా 8 కేజీల మటన్‌ తింటారా?

Advertisment
తాజా కథనాలు