NZ vs PAK: చిన్నస్వామిలో చిన్నపిల్లలని చేసి చితక్కొట్టారుగా.. పాక్‌ని దేవుడే కాపాడాలి! పాకిస్థాన్‌పై కివీస్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 రన్స్ చేసింది. ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర మరో సెంచరీ బాదాడు. By Trinath 04 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అంటేనే పరుగుల వరద ఉంటుందని అభిమానులు ఫిక్స్ అవుతారు. అందులోనూ న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పాకిస్థాన్‌పై జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 రన్స్ చేసింది. Rachin Ravindra continues his brilliant #CWC23 with another century 👏@Mastercardindia Milestones 🏏#NZvPAK pic.twitter.com/Wa0k4SOBAu — ICC Cricket World Cup (@cricketworldcup) November 4, 2023 కెప్టెన్ మావా ఇరగదీశాడుగా: ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కాన్వే, రచిన్ రవీంద్ర(Rachin Ravindra) పాక్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. అయితే ఈ ఇద్దరి పార్ట్‌నర్‌షిప్‌కు హసన్ అలీ బ్రేకులు వేశాడు. 10.5 ఓవర్లలో జట్టు స్కోరు 68 వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 35 రన్స్ చేసిన కాన్వే అలీ బౌలింగ్‌లో రిజ్వాన్‌కి చిక్కాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చాడు కెప్టెన్ విలియమ్‌సన్ గాయం నుంచి కోలుకున్న తర్వాత విలియమ్‌సన్ ఎలా ఆడుతాడా అని అంతా ఎదురుచూశారు. ఎవరి అంచనాలను తలకిందులు చేయకుండా విలియమ్‌సన్ తనదైన శైలిలో పాక్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. అటు యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోని సెంచరీ వైపు పరుగులు తీశారు. రచిన్ రికార్డుల పరంపర: Kanesistent Williamson is back! 🔥#KaneWilliamson #CWC23 #NZvPAK #Sportskeeda pic.twitter.com/kmxk6lgYzc — Sportskeeda (@Sportskeeda) November 4, 2023 విలియమ్‌సన్ సెంచరీ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ సమయంలో కివీస్‌కు షాక్ తిగిలింది. ఇఫ్తికార్ బౌలింగ్‌లో జమాన్‌కు చిక్కిన విలియమ్‌సన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 79 బంతుల్లో విలియమ్‌సన్ 95 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. విలియమ్‌సన్, రచిన్ రెండో వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. తర్వాత రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ. తర్వాత వెంటనే రచిన్ కూడా అవుట్ అయ్యాడు. 94 బాల్స్‌లో 108 పరుగులు చేసిన రచిన్ వసీం జూనియర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత డెరియల్ మిచెల్ వేగంగా రన్స్ చేశాడు. 18 బంతుల్లో 29 రన్స్ చేసి హారీశ్ రౌఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మార్క్ చాప్‌మ్యాన్, గ్లెన్ ఫిలిప్స్ పోటీపడి రన్స్ చేశారు. దీంతో కివీస్ 400 రన్స్ మార్క్ ను దాటింది. Also Read: ఐపీఎల్‌పై కన్నేసిన సౌదీ రాజు .. వాటా కొనేందుకు ప్రయత్నాలు Also Watch: #icc-world-cup-2023 #rachin-ravindra #pak-vs-nz మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి