2023 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ ప్రస్థానం ముగిసింది. అత్యంత చెత్త ఆటతో సొంత దేశ అభిమానులకే చిరాకు తెప్పించిన బాబర్ సేన కథకు ఎండ్ కార్డ్ పడింది. చివరి మ్యాచ్‌లో 6 ఓవర్లలో టార్గెట్ ఛేజ్ చేస్తే సెమీస్‌కు వెళ్తుందన్న పాయింట్‌ను పక్కన పెడితే కనీసం మ్యాచ్ గెలవడంలోనూ విఫలమైంది. అది కూడా ఇంగ్లండ్‌పై ఓడిపోవడం మరింత ఘోరం. ఈ వరల్డ్‌కప్ సీజన్‌లో అందరికంటే దారుణంగా ఆడిన టీమ్ ఇంగ్లండే. అలాంటి టీమ్ చేతులోనూ ఘోరంగా ఓడిపోయింది పాక్. 9 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే మ్యాచ్‌లు గెలిచిన పాకిస్థాన్ ఐదో స్థానంలో సరిపెట్టుకుంది.
లాస్ట్ మ్యాచ్ మారారు:
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మలాన్, బెయిర్‌స్టో శుభారంభం ఇచ్చారు. ఇద్దరు తొలి వికెట్‌కు 82 రన్స్ పార్టనర్‌షిప్ ఇచ్చారు. 39 బంతుల్లో 31 రన్స్ చేసిన మలాన్ ఇఫ్తికర్ బౌలింగ్‌కు పెవిలియన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికి మరో ఓపెనర్ బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 108 వద్ద బెయిర్‌స్టో వికెట్‌ను ఇంగ్లండ్ కోల్పోయింది. ఆ తర్వాత రూట్, స్టోక్స్ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీమ్ స్కోర్ 240 వద్ద స్టోక్స్ అవుట్ అయ్యాడు. 76 బంతుల్లో 84 రన్స్ చేసిన స్టోక్స్ ఖాతాలో రెండు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత 72 బంతుల్లో 60 రన్స్ చేసిన రూట్ షాహీన్ అఫ్రిది బాల్‌కు బోల్తా పడ్డాడు. కెప్టెన్ జోస్ బట్లర్‌తో కలిసిన హ్యారీ బ్రూక్ వేగంగా పరుగులు చేశారు. ఇద్దరూ పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో ఇంగ్లండ్ 300 పరుగుల మార్క్‌ను దాటింది. ఇక చివరిలో విల్లే 5 బంతుల్లోనే 15 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది.
ఏం మారలేదు:
లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ విజయంవైపు వెళ్తున్నట్లు అనిపించలేదు. ఖాతా తెరవకుండానే అబ్దుల్లా షఫిక్ వికెట్‌ను కోల్పోయిన పాక్.. ఆ తర్వాత ఫకర్ జమాన్ వికెట్‌ను కోల్పోయింది. మరో వికెట్ పడకుండా కాసేపు బాబర్, రిజ్వాన్ జాగ్రత్తగా ఆడారు 45 బంతుల్లో 38 రన్స్ చేసిన బాబర్ అట్కిన్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరగా.. 51 బాల్స్‌లో 36 రన్స్ చేసిన రిజ్వాన్‌ను మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 22.4 ఓవర్లలోనే 100 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది పాక్. ఆ తర్వాత కూడా పాక్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది., మిడిలార్డర్‌లో అగా సల్మాన్ ఫర్వలేదనిపించాడు. 45 బంతుల్లో 51 రన్స్ చేసిన సల్మాన్ విల్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పాక్ తరుఫున ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసింది కేవలం సల్మాన్ మాత్రమే. ఇక ఇఫ్తికార్, షాదబ్ వెంటనే వెంటనే పెవిలియన్‌కు చేరగా.. ఆఖరిలో షాహీన్, వసీం, హరీస్ రవూఫ్ మెరుగ్గా ఆడడంతో పాక్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. ముఖ్యంగా రవూఫ్ 23 బంతుల్లోనే 25 రన్స్ చేశాడు. చివరకు పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది.
Also Read: ఆ ఆటగాళ్లపై వేటు.. కఠిన నిర్ణయాలకు సిద్ధమైన పాకిస్థాన్ బోర్డు!
WATCH: