IND vs PAK: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!

అహ్మదాబాద్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగుతోండగా క్రికెట్ గాడ్ సచిన్‌ కామెంటరీ బాక్స్‌లో అలరించాడు. సచిన్‌ కామెంటరీ చేస్తుంటే అహ్మదాబాద్‌ బిగ్‌ స్క్రీన్‌పై 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ని డిస్‌ప్లే చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సచిన్‌..సచిన్‌ అంటూ నినాదాలు చేసి పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

New Update
IND vs PAK: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!

సచిన్.. సచిన్.. సచిన్.. టీమిండియా క్రికెట్ అభిమానుల స్లోగన్‌ అది. 24ఏళ్ల పాటు టీమిండియాకు ఆడిన సచిన్ ప్రపంచంలో ఏ గ్రౌండ్‌లో అడుగుపెట్టినా ఫ్యాన్స్ సచిన్..సచిన్ నినాదాలు చేయకుండా ఉండరు. ఇక పాకిస్థాన్‌పై మ్యాచ్‌ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది సచినే. ఇప్పటివరకు భారత్‌-పాక్ జట్లు ప్రపంచ కప్‌లో ఏడు సార్లు తలపడగా.. అందులో మూడు సార్లు సచిన్‌కే మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించిందటే ఆ జట్టుపై క్రికెట్ గాడ్‌ డామినేషన్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా పాక్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ సచిన్‌ అలరించాడు. గ్రౌండ్‌లో నుంచి కాదు కానీ కామెంటరీ బాక్స్‌ నుంచి. తన చిరకాల ప్రత్యర్థి వకర్‌తో కలిసి ముచ్చటించాడు. రవిశాస్త్రి అడుగుతున్న ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు చెప్పాడు సచిన్.

ఆ రోజును మర్చిపోగలమా బాసూ

వకార్‌ యూనిస్‌ తాను ఫేస్ చేసిన అత్యుత్తమ బౌలర్లలో ఒకరని కితాబిచ్చాడు సచిన్. 16ఏళ్ల వయసులో టీమిండియా తరుఫున అరేంగ్రటం చేసిన్ సచిన్ పాక్‌పైనే అది పాక్‌లోనే తొలి మ్యాచ్‌ ఆడాడు. రెండో మ్యాచ్‌లో వకార్‌ వేసిన బంతి సచిన్‌ ముక్కుకు తాకి బ్లడ్‌ వచ్చింది. అయినా కూడా బ్యాటింగ్‌ కొనసాగించాడు సచిన్‌. ఇక ప్రస్తుత ఇండియా-పాక్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. అహ్మదాబాద్‌ బిగ్‌ స్క్రీన్‌పై 2003లో సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ని చూపించారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ మ్యాచ్‌లో సచిన్ ఆటను గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్‌ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.

శివతాండవం ఆడిన సచిన్:

2003 మార్చి 1 శివరాత్రి రోజున వరల్డ్‌కప్‌లో ఇండియా వర్సెస్ పాక్‌ మ్యాచ్‌ జరిగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 రన్స్ చేసింది. ఓపెనర్‌ సయిద్‌ అన్వర్‌ సెంచరీతో అదరగొట్టాడు. 126 బంతుల్లో 101 రన్స్ చేశాడు అన్వర్‌. 274 అన్నది ఛాలెంజింగ్‌ స్కోర్.. చెప్పాలంటే పాక్‌ జట్టుపై అది టఫ్‌ స్కోర్‌. ఎందుకుంటే అక్తర్‌, వకార్‌, వసీమ్‌ త్రయం ఫేస్‌ దాటికి ప్రత్యర్థులు వణికిపోయే రోజులవి. ముఖ్యంగా అక్తర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. గంటకు 150కిలోమీటర్లకు పైగా వేగంతో ఈజీగా బౌలింగ్‌ వేస్తున్నాడు అక్తర్‌. అయితే సచిన్‌ డిఫెన్స్‌లో ఆడాలని అనుకోలేదు. ఎదురుదాడికి దిగాలన్న డిసిషన్‌తోనే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గంటలకు 150కిలోమీటర్ల వేగంతో వస్తున్న ఓ బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా స్టాండ్స్‌లోకి కొట్టాడు. ఆ సిక్సర్‌ తర్వాత అక్తర్‌ కాళ్లు వణికిపోయినట్టు తర్వాత అతని టీమ్‌మేట్స్‌ చెప్పుకున్నారు కూడా. అక్తర్‌తో పాటు వకార్‌ని కూడా టార్గెట్ చేసిన సచిన్‌ వేగంగా పరుగులు చేశాడు. మొత్తం 75 బంతుల్లో 98 పరుగులు చేశాడు సచిన్. దీంతో టీమిండియా గెలుపు అప్పటికే ఫిక్స్‌ ఐనట్టే కనిపించింది. ఇక చివరిలో యువరాజ్‌ 50 రన్స్ చేశాడు.

ALSO READ: ‘అసలు బుర్ర పనిచేస్తుందా’? ఇలా చేస్తారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..!

Advertisment
తాజా కథనాలు