World Cup 2023: క్రికెట్‌ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి!

క్రికెట్‌సందర్భానుసారంగా చూడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు గేమ్‌ లవర్స్‌. క్రికెట్ ఎక్కువ చూసే వారిలో స్పోర్ట్స్‌మెన్‌షిప్ క్వాలిటీ పెరుగుతుందని చెబుతున్నారు. క్రికెటర్లు మ్యాచ్‌లో ఉపయోగించే స్ట్రాటజీలను ఫాలో అయితే అవి మనకు కూడా లైఫ్‌లో యూజ్ అవుతాయని చెబుతున్నారు. క్రికెట్ చూడడం వల్ల మనసు తేలికపడుతుందని.. స్ట్రెస్‌ రిలీఫ్‌ ఉంటుందంటున్నారు.

World Cup 2023: క్రికెట్‌ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి!
New Update

క్రికెట్ ఇండియాలో ఒక మతం. క్రికెట్ మ్యాచ్‌ కోసం వర్క్‌ షెడ్యూల్‌ని మార్చుకునే దేశం మనది. చాలా మంది విద్యార్థులు క్రికెట్ చూడడం కోసం స్కూల్స్‌, కాలేజీలు బంక్‌ కొడతారు. ఇండియాలో క్రికెట్ చూడని వారి కంటే చూసే వారే ఎక్కువ. ఇక మనిషికి చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే. కేవలం ఆటలు ఆడడమే కాదు.. చూడడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

publive-image

ఎంటర్‌టైన్‌మెంట్: చాలా క్రికెట్‌ మ్యాచ్‌లు చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగుతాయి. ఇందులో ఉండే థ్రిల్‌ అంతాఇంతా కాదు. ఇది చాలా ఫన్‌తో పాటు ఇతర ఎమోషన్స్‌ని కూడా క్యారీ చేసేలా చేస్తుంది. ఓవర్‌ ఆల్‌గా మంచి ఫీల్‌ని ఇస్తుంది.

సామాజిక అనుబంధం: చాలా మంది క్రికెట్‌ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారు. అంతేకాదు అసలు ఏ సంబంధం లేనివారితో కలిసి కూడా చూస్తారు. ఇది సమాజ భావాన్ని పెంపొందించుతుంది. అంటే అందరిని ఒకతాటిపైకి తీసుకొస్తుందిజ

స్ట్రెస్‌ రిలీఫ్‌: బాధలు లేని మనిషి ఉండడు. అయితే చాలా సార్లు క్రికెట్ చూడడం వల్ల మనసు తేలికపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కాసేపైనా బాధలు మర్చిపోయేలా చేస్తుంది

స్ట్రాటజీ: ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం మోస్ట్ కామన్‌ థింగ్‌. క్రికెట్‌లో కెప్టెన్లు, ఇతర ప్లేయర్లు అనుసరించే స్ట్రాటజీలను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇది మనకు లైఫ్‌లో చాలా ఉపయోగపడుతుంది.

కల్చర్‌: క్రికెట్ కేవలం ఒక దేశంలోనే జరగదు. దాదాపు 12దేశాలు యాక్టివ్‌గా క్రికెట్‌లో ఉన్నాయి. క్రికెటర్లు వివిధ దేశాల్లో ప్రయాణిస్తుంటారు. అక్కడ మ్యాచ్‌లు జరిగినప్పుడు వేరే దేశాల వారి కల్చర్‌పై మనకు ఒక అవగాహన వస్తుంది

ఎమోషనల్‌ కనెక్షన్: క్రికెట్ బలమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది . టీమ్‌ లేదా ఆటగాడికి మద్దతు ఇవ్వడం గర్వంతో పాటు ఒక స్నేహ భావాన్ని సృష్టించగలదు.

స్ఫూర్తి: సచిన్‌, ధోనీ లాంటి ఆటగాళ్లను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతారు. వారి బిహెవియర్‌, స్పోరిటివ్‌నెస్‌ రియల్‌ లైఫ్‌లో మనకు ఎంతగానో ఉపయోగపడుతాయి. వారి లాగే ఉన్నతశిఖరాలకు చేరుకోవాలనే స్ఫూర్తిని కలిగిస్తుంది

స్పోర్ట్స్‌మెన్‌షిప్: ఇది అన్నిటికంటే ముఖ్యం. చాలా మంది ఇతరులకు ఏదైనా మంచి జరిగితే ఏడుస్తుంటారు. వారి ఎందులోనైనా రాణిస్తే చూసి తట్టుకోలేరు. అయితే క్రికెట్‌ నుంచి మనం ఇతరులకు గౌరవం ఇవ్వడం, ఎంకరేజ్‌ చేయడం లాంటివి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థులకు కూడా గౌరవం ఇచ్చే కొన్ని ఆటల్లో క్రికెట్ ఒకటి

➼ మొత్తానికి క్రికెట్ చూడడం వినోదంతో పాటు లైఫ్‌లో ఎన్నో విషయాలను నేర్పుతుంది. అయితే అడిక్షన్‌ మంచికాదు.

ALSO READ: సచిన్.. సచిన్..! టీమిండియా అభిమానుల కళ్లలో కన్నీళ్లు..ఆ రోజును మర్చిపోగలమా బాసూ!

#india-vs-pakistan #icc-world-cup-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe