IND vs PAK: మాయదారి దోమ.. పాక్ మ్యాచ్‌కి టీమిండియా తురుము దూరం..! ప్చ్.. ఇలా జరిగిందేంటి? వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత శుక్రవారం డెంగీ పరీక్షల్లో యువ ఓపెనర్ గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్న గిల్ భారత్‌తో కలిసి ప్రయాణించడంలేదని బీసీసీఐ సెక్రటరీ జయ్‌షా ప్రకటించారు. అక్టోబర్ 11న అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 14న పాక్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. By Trinath 09 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి దోమల దెబ్బ సామాన్య ప్రజలకే కాదు.. స్టార్ క్రికెటర్లను కూడా వదలడంలేదు. ఒక చిన్న దోమ అనేక రోగాలకు కారణం.. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్(Shubman gill)ని కొట్టిన దోమ మాములది కాదు.. అందుకే అతను డెంగీ(Dengue) బారిన పడ్డాడు. డెంగీ నుంచి త్వరగా కోలుకోవడం కుదరని పని.. ఎందుకంటే అది ప్లేట్‌లెట్లకు సంబంధించిన వ్యవహారం. గిల్ విషయంలోనూ అదే జరుగుతోంది. డెంగీ బారిన పడ్డ గిల్ ఇప్పుడప్పుడే కోలుకునే సూచనలు కనిపించడంలేదు. గత శుక్రవారం గిల్‌కి డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరం అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. గిల్ (File) అఫ్ఘానిస్తాన్‌తో పాక్ మ్యాచ్‌కు దూరం: అక్టోబర్ 11న అఫ్ఘానిస్థాన్(Afghanisthan)తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌కు గిల్ ఆడడన్న విషయం తెలిసిందే.. ఎందుకంటే ఐదు రోజుల్లో ఎవరూ కూడా రికవర్ అవ్వరు.. అయితే టీమిండియాకు పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ నెల 14న పాకిస్థాన్(Pakistan)తో జరగనున్న మ్యాచ్‌కు కూడా గిల్ అందుబాటులో ఉండడని సమాచారం. ఇది భారత్ జట్టుకు గట్టి దెబ్బగానే చెప్పాలి. గిల్ స్థానంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఏకండా డకౌట్ అయ్యాడు. అతను అవుటైన వెంటనే రోహిత్, శ్రేయర్ అయ్యార్ కూడా డకౌట్ అయ్యారు. ఒకవేళ కోహ్లీ, రాహుల్ నిలపడి ఉండకపోతే టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓడిపోయి ఉండేది. ఎల్లుండు(అక్టోబర్ 11) మ్యాచ్‌లో ఇషాన్‌కి మరో అవకాశం రావొచ్చు. ఆ మ్యాచ్‌లోనూ ఇషాన్ రాణించకపోతే టీమిండియా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సరైన ఓపెనింగ్ పెయిర్ లేకుండా పాకిస్థాన్‌పై ఆడడం నెగిటివ్ అంశం. డాక్టర్ల పర్యవేక్షణలో గిల్: టీమిండియాతో కలిసి చెన్నై నుంచి గిల్ ప్రయాణం అవ్వడంలేదు. చెన్నైలోనే ఉండనున్నాడు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. బీసీసీఐ సెక్రటరీ జయ్‌షా అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఈ ఏడాది గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 20 వన్డేల్లో 1,230 రన్స్ చేశాడు. యావరేజ్ కూడా 72.35గా ఉంది. గిల్ ఏకంగా ఈ ఏడాది ఐదు సెంచరీలు బాదాడు. వీటిలో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో గిల్ ఈ డబుల్ సెంచరీ బాదాడు. నిజానికి ఒకే ఏడాదిలో వన్డేల్లో 1800కు పైగా రన్స్ చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. ఆ రికార్డును గిల్ బ్రేక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. 1998లో సచిన్ ఈ రికార్డును క్రియేట్ చేయగా.. ఇప్పటివరకు ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఇంతలోనే గిల్ డెంగీ బారిన పడ్డాడు. అయితే వరల్డ్ కప్‌లో పాక్ మ్యాచ్ తర్వాత జరగబోయే మ్యాచ్‌లకు గిల్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. ALSO READ: హైదరాబాద్ స్టేడియం సీట్లలో పక్షుల రెట్టలు.. 2 వేలు ఖర్చు పెట్టి వీటిపై కూర్చోవాలా? #india-vs-pakistan #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి