/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gill-1-jpg.webp)
వరల్డ్‌కప్‌లో సచిన్‌ని గుర్తుచేస్తాడనుకున్న టీమిండియా యువ ఓపెనర్ గిల్(Gill)ని బ్యాడ్ లక్ వెంటాడి కుట్టింది. దోమ కాటుకు గురైన గిల్ డెంగీ(Dengue) బారిన పడ్డాడు. గత శుక్రవారం గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి నాలుగు రోజుల పాటు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గిల్ రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. గిల్‌కి ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోయిందని అధికారిక వర్గాలు చెప్పాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో పాటు హోటల్‌లోనే బస చేశాడు. బీసీసీఐ వైద్య బృందం గిల్‌ని పర్యవేక్షిస్తోంది. గిల్ ఇప్పటికీ రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. మంగళవారం తర్వాత గిల్ హెల్త్‌పై బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
Shubman Gill's Arrival in Ahmedabad Ahead of India-Pakistan World Cup Clash. It is still not clear if the 24-year-old opener will be able to play the game against Pakistan but indications are that he is improving.🏏😍🫰#INDvsPAK#ShubmanGill#ViratKohli#CWC23#BCCI#TeamIndiapic.twitter.com/rTAve51Xau
— CricKong Daily Cricket Updates (@CrickongDaily) October 12, 2023
అహ్మదాబాద్‌కు గిల్:
ఎల్లుండు (అక్టోబర్ 14) ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెటర్లు, ఇరు జట్ల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లన్ని ఒక ఎత్తైతే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మరో ఎత్తు. ఈ మ్యాచ్‌కు గిల్ ఆడుతాడా లేదా అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మ్యాచ్ జరగనున్న గుజరాత్ గడ్డపై కాలు మోపాడు గిల్. ఎయిర్‌పోర్టులోకి గిల్ ఎంట్రీ ఇచ్చిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బ్లాక్‌బస్టర్ వరల్డ్ కప్ పోరుకు ముందు అహ్మదాబాద్ చేరుకున్నాడు. గిల్ మాస్క్ పెట్టుకోని కనిపించాడు. చెన్నై ఆస్పత్రిలో డిశ్చార్జ్ అయిన తర్వాత గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదు. అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన గిల్ ను .. భద్రతా సిబ్బంది విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువెళుతున్నారు. ఇక ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే డెంగీ బారిన పడ్డ వారంలోనే ఎవరూ కూడా గ్రౌండ్‌లో దిగే అవకాశాలు ఉండవు.
నువ్వా నేనా:
గిల్ పూర్తిస్తాయిలో కోలుకున్న తర్వాతే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పాక్‌తో మ్యాచ్‌కు గిల్ ఆడేది దాదాపు అసాధ్యంగానే భావించవచ్చు. 24 ఏళ్ల గిల్ గత 12 నెలలుగా సంచలన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతని పేరు మీద ఐదు వన్డే సెంచరీలు ఉన్నాయి. గత ఆదివారం చెన్నైలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత నిన్న(అక్టోబర్ 11) అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన పోరులోనూ ఇండియా సూపర్ విక్టరీ కొట్టింది. అటు పాక్ కూడా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లకు గెలిచింది. పాక్ కూడా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది.
ALSO READ: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే?