IND vs PAK: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్‌.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..!

డెంగీ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. డెంగీ బారిన పడి ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌ గిల్‌ కీలక మ్యాచ్‌కు దూరం అవ్వగా తాజాగా ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లేను కూడా డెంగీ దోమ కుట్టింది. జ్వరం రావడంతో బ్లడ్‌ టెస్ట్ చేయించుకున్న హర్షాకు డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో పాక్‌ వర్సెస్‌ ఇండియా మ్యాచ్‌కు హర్ష కామెంటరీ వినే అవకాశం లేదు.

IND vs PAK: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్‌.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..!
New Update

దొంగ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ టీమిండియా యువ సంచలనం, ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ డెంగీ బారిన పడి జట్టుకు దూరం అవ్వగా.. ఈసారి దోమలు లెజండరీ కామెంటేటర్‌ హర్షా భోగ్లే(Harsha Bhogle)ని టార్గెట్ చేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆయన్ను కుట్టిపడేశాయి. నార్మల్‌ దోమ కుడితే లైట్‌లే అనుకోవచ్చు.. కానీ కుట్టింది డెంగీ దోమ. దీంతో హర్షకు మొదటగా జ్వరం వచ్చింది. ఫీవర్‌ ఎంతటికి తగ్గకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్లడ్‌ టెస్ట్ చేయించుకున్నాడు. అప్పుడు డెంగీ(Dengue) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

పాక్‌ మ్యాచ్‌కు దూరం:
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటి ఉన్న స్టేడియం. అందులో వరల్డ్‌కప్‌.. అది కూడా ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌ మ్యాచ్‌. ఇంతకంటే ఫ్యాన్స్‌కు ఏం కావాలి. అయితే రెండు న్యూస్‌లు మాత్రం ఫ్యాన్స్‌ని కాస్త డల్ చేశాయి. అందులో ఒకటి గిల్ పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవడం.. రెండోది హర్ష కామెంటరీ లేకుండా మ్యాచ్‌ని చూడాల్సి వస్తుండడం. ఎందుకంటే కామెంటరీలో హర్షాకు సపరేట్ ఫ్యాన్‌ బెస్‌ ఉంది. ప్రస్తుత కామెంటేటర్లలో మిగిలిన ఎవరికీ కూడా హర్షాకు ఉన్న ఫాలోయింగ్‌ లేదు. అసలు అప్పట్లో సచిన్‌ ఆటను అద్భుతంగా వర్ణించిన బెస్ట్ కామెంటేటర్లలో టోనీ గ్రేగ్‌తో పాటు హర్షా కూడా ఉన్నారు.

publive-image హర్షా భోగ్లే (File)

హర్షాది యూనిక్‌ కామెంటరీ. షాట్లను వర్ణించడంలో హర్షాని మించిన కామెంటేటర్‌ లేడని చెబుతారు ఫ్యాన్స్‌. ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు హర్షా కామెంటరీ అసెట్‌గా మారి ఉండేది. కానీ ఆయన అందుబాటులో ఉండకపోవడం ఫ్యాన్స్‌ని నిరాశకు గురిచేస్తోంది. మరోవైపు గిల్‌ డెంగీని క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. చెన్నై ఆస్పత్రిలో డిశ్చార్జ్‌ అయిన తర్వాత గిల్ జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లలేదు. అహ్మదాబాద్‌లో నిన్న అర్థరాత్రి ల్యాండ్ అయ్యాడు.డెంగీ బారిన పడ్డ వారంలోనే ఎవరూ కూడా గ్రౌండ్‌లో దిగే అవకాశాలు ఉండవు. గిల్‌ పూర్తిస్తాయిలో కోలుకున్న తర్వాతే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పాక్‌తో మ్యాచ్‌కు గిల్ ఆడేది దాదాపు అసాధ్యంగానే భావించవచ్చు. 24 ఏళ్ల గిల్ గత 12 నెలలుగా సంచలన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతని పేరు మీద ఐదు వన్డే సెంచరీలు ఉన్నాయి.

ALSO READ: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇండియా,అఫ్ఘాన్‌ మ్యాచ్‌ సమయంలో ఏం జరిగిందంటే?

#india-vs-pakistan #icc-world-cup-2023 #harsha-bhogle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe