IND vs BAN: మరో సంచలనం నమోదవుతుందా? జాగ్రత్తగా ఆడకపోతే అంతే సంగతి బాసూ!

ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ షకీబ్‌ ఉల్ హసన్‌ ఆడడంలేదు. నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరు టీమ్‌ల తుది జట్ల వివరాల కోసం హెడింగ్‌పై క్లిక్‌ చేయండి

New Update
IND vs BAN: మరో సంచలనం నమోదవుతుందా? జాగ్రత్తగా ఆడకపోతే అంతే సంగతి బాసూ!

World Cup 2023 India vs Bangladesh: ఇప్పటికీ వరల్డ్‌కప్‌లో రెండు పెను సంచలనాలు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌ను అఫ్ఘాన్‌, దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ మట్టికరిపించాయి. మరో సంచలనం నమోదు అవుతుందా అంటే క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. అందులోనూ సంచలనాలకు మారుపేరుగా నిలిచే బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడు తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 2007 ప్రపంచకప్‌(World Cup 2023)లో టీమిండియా (Team India) గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టడానికి బంగ్లాదేశే కారణం. ఇక చివరి నాలుగు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌ (Bangladesh) ఇండియాపై మూడు సార్లు గెలిచింది. ఇప్పటికే టీమిండియాకు అనేకసార్లు షాక్‌ ఇచ్చిన బంగ్లాదేశ్ మరోసారి రోహిత్ సేనకు పెడుతుందో లేదో కొన్ని గంటల్లో తేలిపోనుంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Also Read: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!

మరో రికార్డుకు దగ్గరలో రోహిత్‌:
ఈ మ్యాచ్‌లో అందరి చూపు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పైనే పడింది. ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ నుంచి ఫ్యాన్స్ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. అందులోనూ బంగ్లాదేశ్‌పై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అది కూడా ప్రపంచ కప్‌లో మరెవరికి సాధ్యం కాని రికార్డులను రోహిత్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే అతను ఖాతాలో మరో అరుదైనా రికార్డు వచ్చి చేరుతుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పై రోహిత్ సెంచరీలు బాదాడు. ఈ మ్యాచ్ లోను రోహిత్ సెంచరీ చేస్తే వరల్డ్ కప్ లో ఒకే జట్టుపై వరుసగా మూడుసార్లు సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటికే ఏడు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్.

మరోవైపు ఓపెనర్‌ గిల్‌ (Gill) కూడా ఇంకో రికార్డు ఊరిస్తోంది. ఇంకో 67 పరుగులు చేస్తే వన్డేల్లో వేగంగా 2,000 పరుగుల మార్క్‌ను చేరుకున్న ప్లేయర్‌గా గిల్ నిలుస్తాడు. అటు కింగ్‌ కోహ్లీ (Virat Kohli) కూడా సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డుని బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అటు బౌలింగ్‌లో బుమ్ర, సిరాజ్‌తో టీమ్ ఇండియా ఫుల్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఇటు స్పిన్‌లో కులదీప్ యాదవ్ బంగ్లాదేశ్‌ని కట్టడి చేసేలా కనిపిస్తున్నాడు. ఇంకా జడేజా బౌలింగ్, ఫీల్డింగ్ టీమ్ ఇండియాకు అదనపు బలం కానుంది.

India vs Bangladesh ప్లేయింగ్ XI:

బంగ్లాదేశ్ : లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం

భారత్: రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Also Read: ఆ సింహం రికార్డు బద్దలు కొట్టేందుకు బరిలోకి దూకుతున్న పులి.. ఇక బంగ్లాకు బ్యాండ్‌ బాజే..!

Advertisment
తాజా కథనాలు